పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
మూడవ ప్రకరణము


ముప్పదినాలుగేండ్లవయస్సు కల దయ్యును దూరమున నుండి చూచుటకు చిన్నదానివలెనేయాండును.


అంతట సీత మరల జావడిలోనికి బరుగెత్తుకొని వచ్చి, 'నాన్నగారూ!వంట అయినదట!అమ్మ స్నానమునకు లెమ్మనుచున్నది ' అని చెప్పి, యెప్పటియట్ల గవ్వలాడుట కయినూతి పంచ పాళిలోనికి బోయెను.


రాజ-ప్రసాదరావుగారూ!మిరుస్నానము చేయుదురేమో నూతిదగ్గఱకు బొండి. భైరవమూతిగారూ! గోదావరికి వెళ్లెదరా?లేక నూతియొద్దనే నీళ్ళుపోసుకొనెదరా?


భైర-----కార్తికసోమవారము గనుక గోదావరికే వెళ్ళెదను.


అప్పుడక్కడ నున్నవా రందఱును లేచి, రాజశేఖరుడుగారి యొద్ద సెలవు వుచ్చుకొని యెవరి యిండ్లకు వారు వెళ్ళిరి. రాజశేఖరుడు గారును పడమటింటి లోనికి నడచిరి. లోపల సానమిద గంధము తీయుచున్న మాణిక్యాంబ మట్టియలచప్పుడుతో పడమటింటి దొడ్డి తలుపుకడకు నడచి,యొకకాలు గడప కీవలను రెండవ కాలు పం చపాళిలోను బెట్టి, కుడిచేతితో ద్వారబంధమును బట్టుకొని నిలువబడి 'రుక్మిణీ!బాబయ్యగారు స్నానమునకువచ్చినారు;వేగిరము వచ్చి నీళ్ళందిమ్ము 'అని కేకవేసెను. ఆ పిలుపు విని,దేవతార్చనకు బూలు గోయుచున్న రుక్మిణి "వచ్చుచున్నాను "అనిపలికి తొందరగా రాగిహరివారణముతో నిత్య మల్లిపుష్పములను తులసి దళములను దెచ్చి దేవున కరుగుమీద బెట్టి తండ్రిగారికి నీళ్ళిచ్చుటకయి వంటయింటి దొడ్డిలోనికి బోయెను. మాణిక్యాంబ కంచుగిన్నెలలో గంధాక్షతలును గూటిలోనున్న యద్దమును విభూతి పెట్టెను గొనివచ్చి దేవు నరుగువద్ద నున్న పీటదగ్గఱ బెట్టినది.