522 రసికజనమనోరంజనము
ఉ.అనగుమోము చక్కఁదనమాతళుకుంజిగి చెక్కుదోయి యొ
ప్పా నిరుపేదకౌను సొగపావెలితళ్కు పిసాళిచూపుడం
బానిడవాలుగన్బెళుకు లాజిగినిద్దపు మేనిసోయగం
బానునుసోగపెన్నెరుల యందమయారె యొయారికే తగున్. 108
క.అమ్మచ్చెకంటి చక్కఁద
నమ్మంతయుఁజెప్పఁదరమె నాతిపిఱుఁదు నం
దమ్మెన్నఁగ నొకనాఁడౌ
నెమ్మెగమ్మెన్నంగ నొక్క నెలయౌఁజుమ్మీ. 109
గీ.అనుచువెండియు నేమిమెయనఁగడంగు
చిలుక నరచేతనేమాన్చి చెలువుమీఱఁ
బలికెనాతండు తాళుమోచిలుకరాయ
వలదు నీమాటకడ్డంబు వత్తునివుడు. 110
గీ.నన్నుసైరించి నేనివుడెన్నఁబోవు
పలుకువిని దానికిని మాఱు పలుకవలయు
వింతదోఁపంగ నాతోడ నింతదనుక
తేటగానీవు పలికిమాటలందు. 111
క."వెలిచాన నడుమనుంచిన
యలరెడు సంపంగిమొగ్గ"యనిచెప్పితివా
చెలువను నామెయొనర్చెనో
కలుగునొ వేఱొండుతెఱఁగు కలయదిచెపుమా. 112
గీ.అనిన జిలుక పలుక నౌ చెలిచానయె
చేసె నానెలంతఁజెప్ప కింత
వఱకు నునిసైపవయును బయనంపుఁ
దోందర మును చెప్పుఁదోఁచదయ్యె.
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/528
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది