పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము


 గీ. చెలఁగి పలుచాలుఁగేలు మైజిగులఁబోలు
    నాసదానిమ్మయు నిగుర్లు నలరు మొదలు
    నడుముఁ దుదిలేని వేలుపుఁ గడఁగికొలిచి
    తామునట్లె చనులఁ గొప్పుఁ దఱులఁ బోలె.

ఉ. పోలఁగవెన్ను చూపె వరిపొట్టులు నేనుఁగు కేలుమోడ్చెఁ దా
   మేలును బొట్టలోన దలపెట్టుకొనెం దలవంచెనంటులున్
   దూలుచు లేళ్ళుగడ్డితినెఁదొయ్యలి పిక్కలఁ జన్నుదోయి మీఁ
   గాళుల నిద్దవుందొడలఁ గన్నులఁబోలఁగ జామింజుమీ.

క. నెలయా మొగంబుజిగి వె
  న్నెలయా తెలినవ్వుజవ్వు నెఱబంగరు గి
  న్నెలయా చన్నుంగవతి
  న్నెలయారె పిఱుందుదోయి నెలఁతకుఁదలఁపన్.
   
గీ. కాలియందెలన్ పాదులఁగలయఁబెరుగు
   నరఁటికంబంబు లెన్నంగ నతివతొడలు
   దాని యాకువీపు చలువదలఁచిపాదు
  కదిసినట్టి తాబేళ్ళు మీఁగాళ్ళుతలఁప.101

గీ.చెలువ నెమ్మోము చందురు గెలువఁజూచి
  యడుగుఁదమ్ములిదియె మంచియదనటంచు
  నతని కొమ్మలనీడ్చి తెచ్చి తమలెంక
  లుగ నొనర్చికొనెనన గోళ్ళొగిఁ జెలంగు.102

చ.చిలుకలకొల్కి నెన్నడుము సంగపుఁ జెల్వముఁజూపుఁ రూ
వులపసమించు మించులకుఁ బోఁడిమిమై జిగినించు నించుమి
క్కిలినగుఁబల్కు పల్కుదురె కెంపులసొంపులు మావు మావు వె
న్నెలలఁగని నవ్వునవ్వు జిగిఁనిద్దమెఱంగు మెఱుంగుఁ జెక్కిళుల్‌.103