పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమా శ్వాసము


మ. కనుచేఁకుల్ బిగిగుబ్బజక్కల వీఁకంజూచి లోజంకి వే
డ్కను జేరంజని మోముచందురుని యండంకేకనూగారు పా
మనికింబొకిలి పుట్టవేవెడలిడాయంగాంచి వేఁడంగ వ
వచ్చిన జాబిల్లియనుంగుకొమ్మలన మించెన్ ముత్తియంపున్సరుల్.

గీ. మల్లె మొగ్గలజిగిఁబోలుఁ బలుమెఱుంగు
బలుమెఱుంగునుబోలుఁ గమ్మమెయితేట
లోలిమెయిఁదేఁటులనుబోలు వాలు నెఱులు
వాలునెఱులనుబోలు నప్పడఁతియారు

చ. మెలఁతుక చన్నుఁగొండలకు మీఁదను జిందపుదిట్టనెంతయున్
జెలువుగఁగొల్చి గొంతువెసఁజిందపు దిట్టతనంబువూనఁగా
బొలుపుగఁ జట్టువాలుదొరఁబొందెఁబిఱుదులు సైపలేకనే
ర్పలవడవెన్నుఁ జేరె నలపై దలికీల్జడ వింతదోపఁగన్.

చ,. మరుఁడను వేఁటకా డతిపబల్ చనుగొండలయండ ముత్యపు
న్సరులను బియ్యమాసలఁ బెనంగఁగ మచ్చిడి యదగాండ్ర య
బ్బురమగు డెందపు బులుగు మొత్తఁముబట్టుచు నీరుద్రావడ
గ్గరఁ జనుబొడ్డుడిగ్గియకుఁ గట్టినబంగరుమెట్టు లత్తఱుల్.
 
               
గీ. జవ్వనవుదఱిఁ గన్నియచన్నుదోయి
కౌనుకలిమిదోఁచుకొనియెఁ గాక యున్న
నింతలోగుబ్బలకుఁ గల్మియెట్టులబ్బె
నేమికతమున నడుముకు లేమికలిగె.

గీ. జవ్వనవుదఱిఁ గన్నియచన్నుదోయి
కౌనుకలిమిదోఁచుకొనియెఁ గాక యున్న
నింతలోగుబ్బలకుఁ గల్మియెట్టులబ్బె
నేమికతమున నడుముకు లేమికలిగె.