ప్రథమాశ్వాసము
చ. ఉడుగని వేడ్కతోడ మనమోచెలి యింతకుముందు త్రోవలో
నెడననుకొన్న దాని కితఁడేతగుఁ గన్గొని ముచ్చటాడి వే
వెడలుట మంచిమేలుగద వేయని యందొకచిల్క సంతనం
బడరఁగఁబల్కెఁ గవ్వడికి నల్లవిసంబడఁ దోడిచిల్కతోన్.
సీ. అట్లు నేలకు డిగ్గి యాతండుగన్గొన
మురువుఁజూపుచుఁ గొంతపొంతయెల
మ్రోలసంపఁగిచెట్టు వాలుగొమ్మను వ్రాలి
చూడ్కికింపును సొంపుఁజూపుచుండ
నంతవివ్వచ్చుండు చెంతఁజిల్కలఁగాంచి
రాచిల్కలార మీరలనుకొన్న
దెయ్యదిత్రోవలో నెవ్వనితో ముచ్చ
టింపఁగావలెనిందు నెందులకును
మీరలేపని కరుగుచున్నారలిపుడు
పయన మొకయింత గుదియించిపలుకనైన
నదియుమాకుఁ జెప్పఁగవచ్చు నదియెయైన
నించుకంతనిలిచి వినిపింపవలయు.
క. ఇందఱముందఱ నిందది
పొదుగఁ జెప్పంగమీకుఁ బోలనిదైనన్
సందడిడిందఁగ నాతని
నెందైనఁగొనిచని ముచ్చటింపఁగఁ జెల్లున్.
క. మీయందము చందము కం
దోయికి విందు గొలుపుచును దొందరనొందం
జేయుచునున్నది మీపొం
దేయడ నెడఁ బాయజూఁతురే యెవరైనన్.