రాచిల్కపల్కులం జెలువుగులుకు సింగారంపుఁదోఁటలును హెచ్చుగ
నిచ్చులు మెుచ్చులుగుల్కు వచ్చంపు ఁ బచ్చలతిన్నెలఁ జె న్నగునెన్న
రాని తిన్నని పగడంపు ఁ గంబంబు గుంపుల పొంపులునింపు పెంపగు
కొలువుకూటంబులునుం గలిగి మావులుం దావులుంగలిగి యెుల
దోఁటసాటిని ముత్తెసరులు బంగారుతీగెలునుంగలియుం దగవులేక
సిరికాటపట్టుయి పొల్కడలివడువునఁ దగవుకగియుం దగవులేక
గోతులచే నొప్పియు గోతులులేక యెుప్పి కొట్ట్లుండియు గొట్ట్లులేక
కరంబు డంబువిూఱు.
.క. అవ్వీడు యుదిష్టిరుఁడను
పువ్విలుతునిఁ బోలుఱేఁడు పొందుగ నేలు౯
జవ్వనము బలిమికలిమిని
దవ్వలదొరలెల్ల ఁ దన్నుఁ దద్దయుఁగొలువన్
సీ. కడునొప్పుతనదు చాగవునీటియెుటీకిఁ
గడలికొండొక పిల్లకాల్యగాఁగ
గ్రాలుతనయసంపుఁ బాలవెల్లికి ముజ్జ
గంబులు దీవులడంబుసూపఁ
దనదు మార్తురకును దట్టంపుటడవిచా
లిఱుకైనచాలని యిండ్లుగాఁగఁ
దనిదుమార్తు రకును దట్టంపుటడవిచా
నేతెంచుదొరలకు నిమ్ముగాఁగ
నొప్పు గాఁవుల కెల్లను నోముపంట
పాఱులకు సాదులకు గొప్పపట్టుకొమ్మ
బీదసాదలపాలిటి వేలల్పు చెట్టు
జగములందెల్ల మేటి యజ్జమునికొడుకు.
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/515
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
