రసికజమనోనంజనము
సీ, ఏనుంగుతలల బాలిండ్లుసొంపుగజేసి యానల్పుకొప్పులనలవరించి
చిందమ్ములనుగొంతు లందమ్ముగాజేసి
యాతెల్పు నవ్వులయందు బెట్టి
మల్లెముగ్గల చాలు మరి పల్వరుస జేసి
యామెత్తన పెదివులందిమిడ్చి
మఱ్రి పండులజన్ని జేసి మడిమలుకావించి
యాయెరు పడుకులయందమర్చి
నలువ యవ్వీటిబోటుల నలువుమీర
జేయబోలుగాకున్న నాసోయగంబు
వీసమంతై నగలుగదే వెతికిచూడ
ముజ్జగములందుగల వువ్వుబోడ్లయందు.
వ. మరిము నవ్వీడు నేడ నీడులేని వేడుకలగూడిమాడి ప్రోడలయి రేనిగాన నేతెంచిన లాతివిలాతుల యెడయండ్ల కడవన్నె బెడంగు బంగరు మగరానగల తెగలు రాపిడిందిగిలి నొగిలి నిగనిగ జిగ మిగుల దిగువంబొడియైకడు బుడమింబది యదరు కడిం దియినుక లెసకమెసగు తెరువులను నింతంతనరాని సంతంసబున బంతులుగట్టి రంతులుసేయుచు నెంతయునింతగా బంతంబున జేమంతి పూబంతుల పొతకు గంతులిడుమేటితేదాటుల తేటపాటలనాటంబయి యిరుగెలంకు బింకంవు గొరవంక తెగలుగల కొలంగదలును నీలిడాలు చేలలంగ్రాలు మేలిజెండాలచాలు గాలింగదలంబొదలు తగులున ముదలు తెగలని నిగిడి మిగుల పొగరున మగిడి నెట్టిన గట్టిడి వుట్టనట్టులం జుట్టుముట్టి కిట్టి పట్టిబెట్టుగ నిట్టూర్పులెడలం గట్టొగ గొట్టి పట్టరాని కట్టలుకంబొట్టలు పగులంగొట్టు బెట్టిదంపు ఖని కట్టిపెట్టి నట్టువంబుసలువుదిట్టనెమ్మిపిట్టల నొప్పియొప్పులుగుల్కు