పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనమనోరంజనము

తే.గీ.అప్పనంబుగనానేర్చునట్లొనర్పఁ
బూనుచిత్రాంగదయనంగబొలుచునట్టి
మెలతపెండ్లితెఱఁగుజనమేజయుండు
వినెడువేడుకమదిలోనఁగొనలుసాగ.

వ.వైశంపాయనుంగనుంగొని.

తే.గీ.పెద్దయునుమాకొలంబునఁబేరుపడిన
క్రీడియెట్లుచిత్రాంగదకేలువట్టె
వేడుకలుమీఱనాలింతువీనులలర
దాఁచకానతీవయ్యయోతబిసిరాయ.

క.అనజడదారియుఱేనిం
గనుఁగొనిసందియముతీఱగారవమార౯
వినిపింపదొడఁగెగవ్వడి
మునుముద్దియఁబెండ్లియైనముచ్చటయెల్లన్.

సీ.మగఱాలజిగితూలనగఁజాలువగఁగ్రాలు
తెలిడాలుగలమేలుతిన్నెలమరఁ
బెనుగట్టులనురట్టులనుబెట్టునునుగుట్టుఁ
గొనితిట్టఁగనుపట్టుకోటలడర
నలరమ్ముచెలువమ్ములలిఁగ్రమ్మివెలిగ్రుమ్ము
మురిపెమ్మునెరనమ్ముముగుదలలర
నెనలేనిగొనబూనిపెనుకోవలనుదేనె
తెరిలానుదొరలేనితేఁటులొలయ

నెచటఁగనుఁగొన్ననేనుంగులేపచూప
నెల్లచోటులగుఱంబులెసకమెసఁగ
ముజ్జగంబులఁగలప్రోళ్ళమురుపునవ్వి
యలరుచుండునింద్రప్రసమనెడువీడు.