మూడవ ప్రకరణము
బొర్లించి యాతని పొడుముబుర్రకు పుచ్చుకొని ; మునుపు చేతిలో నున్నపట్టును బాఱవ్ై చి క్రొత్తపట్టు పట్టీ నగము పీల్చి రాజశేఖరుఁడు గారివ౦కఁ దిరిగి “రాజశేఖరుఁడుగారు ననుమఱచి పోయినట్టున్నారు| ”. అనెను.
- రాజ–“లేదు లేదు.” అని మొగమువ౦కఁ బాఱఁజూచిరి.క్రొత్త–ఇంకను నానవాలుపట్టలేదు. మీరు నన్నూ పది సంవత్సరములు క్రి౦దట రాజమహే౦ద్రవరములో రామమూర్తిగారి లొపల జూచినారు. నేను వామరాజుభైరవమూర్తిని. మనమందఱమును దగ్గ బ౦ధువూలమూ , మీతల్లిగారి మేనత్తయల్లుఁడు మామేన మామగారికి సాక్షాత్తుగా నొకవేలు విడిచినమేనత్తకొడుకు , మొన్నమాఅన్నగారు సా౦బయ్యగారు మీయింట నెలదినములుండివఛ్ఛిన తరువాత మీరుచేసిన యాదరణనే నిత్యమును సెలవిచ్చుచు విచ్చిరి; వెళ్ళునపుడు మీరుపెట్టిన బట్టలనుసహితము పెట్టెతీసి చూపినారు. దానిని జూచి మన బంధువులలో నొకరు మీ రింతయనుకూలమయిన స్ఢితిలో నున్నారని పరమానందభరితుఁడ నయినాను.
ఆమాటలువిని లోపలి గదిలోఁబండుకొని యున్న యొక ముసలాయన దగ్గుచు లేచివఛ్ఛి“ఓరీ భైరవమూతి నీ వెప్పుడు వఛ్ఛినావు”
భైర−ఓహోహొ ! ప్రసాదరావుగారా మీరు విజయంచేసి యొన్నాళ్ళయినది ‽
ప్రసా–రెండుమానములనుండి యిక్కడనే యున్నాను.బంధువని రాజశేఖరుని జూచిలపోదమని వఛ్ఛి యితనిబలవంతమునకు మాఱు చెప్పలేక యిక్కడఁ జిక్కుపడ్డాను. మన బంధువులలో రాజశేఖరుఁడు బహుయోగ్యుఁడు సుమీ;”అని కూర్చుండెను.