పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర విజయము


రాఘ-మొన్న జరిగిన స్వామి యుత్సనములలోభోగము మేళము రాలేదే.


రాఘ:.... వారన్ని యుత్సవములలో రారు. రాజమహేంద్ర వరములో గాపుర మున్నారుగనుక చిల్లరపండువుల కెల్ల బండ్లుచేసికొనివచ్చు, బహుప్రయాసము. ఒక్క స్వామి కళ్యాణదినములలో రధోత్సవము నాడు మాత్రము వత్తురు. అప్పుడు వారి బత్తెము క్రింద స్వామి ద్రవ్యములో నుండి నాలుగు రూపాయిలు మాత్ర మిచ్చుట యాచారము.


ఇంతలో నెవ్వరో ముప్పది సంవత్సరముల వయస్సుగల చామనచాయ గృహస్థు తెల్ల బట్టలు గట్టుకొని కుడిచేతిలో నున్న పొన్నుకఱ్ఱ నాడించుచు, ముందఱనక కూలివాడు బట్టలమూటను నెతిమిద బెట్టుకొని నడువ,నడవలో నుండి చావడిలోనికి చొరనగా నడచివచ్చి అచ్చట నిలువబడి,"ఓరీ! రామిగా!మూట లోపలికి తీసికొనిపోయి యెవరినైన బిలచి రాజశేఖరుడుగారు పరుండుగదిలోబెట్టి రా" అని కూలివానిని నియమించి, కూరుచున్న వారి నందఱిని త్రోచుకొనుచు నడుమ నుండి వచ్చి మున్నెంతో పరిచయము గలవానివలెనే తాను రాజశేఖరుడు గారి ముందఱ తివాచిమిద గూర్చుండెను. రాజశేఖరుడుగా రావఱ కెన్నడును అతని మొగమే యెఱుగక పోయినను పెద్దమనుష్యు డింటికివచ్చినప్పుడు మర్యాదచేయక పోయిన బాగుండ దని, కొంచెము లేచి 'దయచేయుడ 'ని చేయిచూపి తాను గొంచెము వెనుకకు జరగి చోటిచ్చి"యింటివద్ద నందఱును సుఖముగా నున్నరా?" యని కుశలప్రశ్నమును జేసి "మిరెవర"ని యడిగిన దప్పుపట్టుకొందురేమేయని సం శయించుచు నూరకుండిరి. అప్పుడావచ్చినాతడు తన పొడుము కాయను రాఘవాచార్యుల వంక