Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము


చ.అనియెఱిఁగించున్నతఱి నంతకునంతకు జాలుకొంచుఁగ
నొనలను జాఱునీరడఁచికొంచుఁ డెఱంగెఱుఁగంగనీక క్ర
న్ననఁదలయింతకుంచి యెద నాఁటినజాలిన నేలచూచుచుం
గనుఁగొనకూరకున్నఁగని నాతుకచెంగటికేగి కేశియున్ ....69

క.ఆతండాడినతెఱఁగును ః జేతలఁదాఁగన్న తెఱఁగుఁజెచ్చెరనొంటి
న్నాతుకకెఱింగించిననెదః నాతని నలుఁగాఁదలంచి యనియెంజెలితోన్, 70

ఉ.ఇంకనునొక్కసారి యటకేచని యాతఁడయోధ్యఱేనికిం
డెంకినిగూడొనర్చునఁట టెక్కుగఁజూచి యసడ్డలేక లో
జంకకయంతయుందెలిసి చయ్యనరాఁదగునన్న గ్రక్కునం
గొంకకయేగికనొనియెఁ గోరికలీరిక లెత్తనంతయున్ 71

క.కనుఁగొనియరుదందుచుది| గ్గునఁజనుదెంచి యెలనాగగోరినకరణిం
దను కన్నదియెల్లనుని| ట్లనియెఱిఁగించె నెదలోని యడలక్షఁగంగన్.72

ఉ.ఆయన జాడలెలఁదగనారయ నేలకు డిగ్గినట్టిజే
జేయనఁదోఁచె నట్టి నెఱచేఁతులుతొల్లియునెన్నఁడైననే
నేయెడనాలకించియును నించుకకాంచియుఁ గ్రాలుగంటిరో
నీయడుగాన కాన నలునిం గనినట్టులయయ్యెనాయెదన్.

సీ.కట్టెయొక్కటిగొని నట్టింటరాచినఁ
జిచ్చుందుఁగలుగును జిటికలోన
గూడుడికెడునతకును గట్టెలిడకయె
యంటుక సురసురలాడుచుండు
నంజుళ్ళుకడుగుకొనఁగ నీరుకోరుడుఁ
గ్రాఁగులు నిండంగఁగలుగుచుండుఁ
గై తాఁకియలరులు కందియుఁదొల్లింటి
చెన్నొకించుకయును జెడక యుండుఁ