పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/487

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయా శ్వాసము
జనితెలియంగజూడు చెయిచాయను జెన్నగు నల్లతాడిక్రొ
న్ననలును గాయలాకులను నాకనినట్లెఱుగంగ జేసెదన్ .

సీ. నూఱునూఱ్లయొకండు నూల్కొనికొనలందు

నలరులుగాయలునలరుచుండు
నీరేనుకొఱతగా నేను నన్నూఱులు
కయలాకులుగ్రిండగ్రాలుచుండు
ననుచునాడిననుడు లాలించియటకేగి
యన్నింటి జక్కగానెన్ని కాని
యిన్నియనితెలియనెఱు గంగరాదని
యెదలోనగట్టిగా నెంచినలుడు
తత్తడులత్రాడు లొక్కట దనదుచేత
దిగిచినొలగ నొయ్యనగట్టి తేరుడిగ్గి
చీరయొక్కింత చక్కగా జేర్చికొనుచుఁ
జెట్టుకడకేగి నెట్టననట్టెయెక్కీ

క. ఎన్నిక యొనర్చియాతం

డన్నట్టులహెచ్చుతగ్గులన్న నులేకా
క్రొన్ననలుగాయలాకులు
నున్నగనుగొనియరుదెందియొయ్యనదిరుగన్

క. చనుదెంచునాకు దీనిని ! నెనరున నీఱేడొసంగ నీకొననేలా

గుననై నను నేసేదె ! ననితనయెదలోదలంచి యాదొరతోడన్.

క. నినునేనీనా డేతగ ! గొనిచేర్చెదనాతి యూరుకోరికదీఱం

గనునిది నాకిడికోరిక ! కొనసాగించినను నేలికొనగదె యిచట౯.

క.అనియడిగికొన్న దొరగై ! కొనునీకిచ్చెదనుదీని గోరికతీఱం

గననియొసంగిననింతం ! తనరాని నెనరునకునెర నలరుచునలుడున్.