ఈ పుట ఆమోదించబడ్డది
- తృతీయా శ్వాసము
- తిరుగగడిదేఱినలుగడల్ తెలియజూచి
- యెట్టకేలకు దనలోననిట్టులనియె.
ఆ. కానదన్నుడించి కడచన్నకతనగా
- కలికి యిట్లుచేయ గడగెనేడు
- గోతియెంతయు నెదగూర్చునునాకంచు
- నచ్చియుండనతడె హెచ్చుచెనటి.
ఆ. గోలనాకుగూర్చు గొడుకులుగలయది
- యిట్టులేలచేయు నింతియైన
- నెఱిగియరుగుదెంతు నీఱేనితో గూడి
- యేగియచటికంచు నెదదలంచి.
గీ.తొల్లితనక త్తలానుల దోలునతడు
- తెచ్చియిచ్చటనుంచిన తెల్లజిగిని
- దనచుఱుకైన తనతేరి తత్తడులను
- రెంటిగొని తెచ్చితద్దయుదంటయగుచు.
ఉ. తేరికిగట్టుచోనొఱగి తేజులుతూలుటగాంచి ఱేడులో
- దారినిసోల కీయసదుతత్తడు లెట్టుగ నేగనేర్చు నీ
- కోరికదీఱ నొండుజత గూరిచిగట్టుట లెస్సయన్న లో
- నీరికలెత్తిహెచ్చరిక నిట్లనియె న్నలుడోర జూచుచున్.
క. ఈ తేజీలించుకలో ! నీతేరీడ్చుకొని యలుగు నింకెఱనరుగుం
- జూతఱలి యయోధ్యకునే ! డేతొగదాయ కడలితఱి కేగెడుతఱికిన్.
గీ. అనినిటులైనఁ గడులెస్స యరిగిసరగ
- సూరుచేరిన యంతటినొక్కసారి
- కోరికలు దీర్తునని తేరుసేరియొక్కఁ
- నలుడునింకొక్కడునుదోనుదోడనరుగు దేర.