పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. అనియంతయు దెలిసికొనం

దనయెడగోరికలు క్రేళ్ళుదాటంగానా
తనినన్నెలంతయడిగిన
నొనరగ నెరిగించి నిట్టులున్న తెఱ్ఱంగున్.

క. ఇదిక్రధకై శికుకూతురు

చదురుండగు నలునిరాణి సరిజూదాన౯
జదురడగి నేలయెల్లను
దుదకాయన యోడీయాలుతో గానలకున్.

చ. చనె ననుటాలకించి యెదజల్లని యాక్రధకై శికుండు న

ల్లునిదనకూతు జయ్యన నలుంగడ లారసి యెందునున్న గై
కొని చనుదేరగా ననిచెగొందఱ సాదుల జన్నిగట్ల నే
నును నరుదెంచి చేడియగు నుంగొనియుం దొలుతందటాలున౯.

గీ. గుఱుతిడంగలేక కొంతనిలిచితాత

సిరులుదొరకుకొఱకు చేసినట్టి
చిన్నెనుదుట గాంచి చెలరేగితుద కేను
నిన్నెలంతయౌటయెఱిఁగికొంటి.

మ. అనినన్నీళ్లులి తేరగాననిచి యొయ్య న్నెన్నొసల్ తానెలో

నెనరారం దనచేతులంగడిగి చిన్నెంగాంచి రాకన్నియల్
కని యెంతో యరుదందగౌగిటను జక్కంజేర్చియాతొయ్యలిం
దనయోరంజెయిసాచిరాదిగిచి కన్నీరొల్క గానిట్లను౯

సీ. ననుగన్నతల్లి నేనునునీదుతల్లి యుఁ

జేదిదశార్ణుని చెలికిగకిగి

నేనెతానుగనుండ నా నెలంతయుదొల్లి

యలక్రధకై శికు నాలియయ్యె