పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖరచరిత్రము

యభిప్రాయమేమనిసభలోనున్నవారినడిగెను. వారందఱునుమనస్సులో స్త్రీవిద్యయన్ననేవగించువారేయయినను రాజశేఖరుఁడుగారి యభిప్రాయముతెలిసి న పిమ్మటదానికివ్యతిరిక్తముగా నేమియుజెప్ప నలవాటుపడినవారుకారుగావునస్త్రీవిద్యాభ్యాసమువలనగణనాతీతములయినలాభములుగలవనిపొగిడిరుక్మిణికివిద్యనేర్పుచున్నందునకయి రాజశేఖరుఁడుగారినిశ్లాఘించిరి.


చిలుక పంజరమున్న తావునుండి నాలుగుబారలు నడిచిన తరువాత పడమటింటిద్వారమున్నది. పడమటియిల్లు విశాలమయి యేఁబదిమందిబ్రాహ్మణులు భోజనములు చేయుటకుఁ జాలియుండును. ఇఁకఁగొంచెము సేపునకు భోజనములకులేతురనఁగావెళ్ళిచూచినయెడల, మూరెడుమూరెడెడముగా రెండుగోడల పొడుగునను పీటలునుపీటలకుముందఱపిఁడిమ్రగ్గుతోపెట్టిన పట్లును చాలుగానుండును. పడమటింటి యీశాన్యమూలను గచ్చుతోఁగట్టినదేవునరుగుకలదు. ఆయరుగుపయిన 'భువనేశ్వర ' మనుదేవ తార్చనసామానులను సాలగ్రామాదులును పెట్టుపెట్టెయుండును. ఆపెట్టెమీఁదనే రాజశేఖరుఁడుగారు మడితో నిత్యమునుపారాయణచేయు శ్రీమద్రామాయణమును సుందరకాండము పెట్టఁబడియుండెను. రాజశేఖరుఁడుగారు స్నానముచేసి వచ్చిదేవునరుగుముందఱ పీటవేసికొనికూర్చుండి రామాయణమును పంచపూజయుచేసికొందురు. దేవునరుగునకెదురుగానున్న తలుపుతీసికొని యావలకువెళ్ళిన చోనొకపెరటిలోనికిఁబోవుదము. అక్కడసున్నముతోను ఇటుకలతోనుకట్టినతులసి కోటయొకటి నాలుగయి దడుగులయెత్తున నందమైయుండెను. ఆకోట లోపలల క్ష్మితులసియుకృష్ణతులసియు శ్రద్ధాభక్తులతోఁ బెంపఁబడుచుండును. ఆసమీపముననే కొంచెముదూరమున తులసివనమును