పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

ఉసురులైనను దొఱఁగంగనోర్తుఁగాని
    యిట్టినడినొందఁగలనైననింతిచాలఁ
    గావనిదితక్క నొక్కటికలిగెనేని
    చేయఁదగునన్నతనితోఁజేడెయనుయె.

గీ. ఎన్నికడగండ్లుతొడగియు నెల్లరకును
    నన్నుఁటినిదోలికాచెడి దాలుగాదె
    యాలుతోఁగూడియుండెడునాతండెన్ని
    ఇక్కటుల్ గుడియును దానెఱుఁగకుండు.
క. అలయునెడల దగయునునాఁ
     కలియునునగుతఱినినాలుగాదేనేగుల్
     తొలఁచునుదననెయ్యునికిం
     గలఁగుచునిక్కరణి జాలిఁగైకొననేలా.

గీ. ఎట్టులైనను నన్నునునెచటికేగఁ
     దలఁచితటకును నీతోడఁదనరఁగొంచు
     నేగఁదగుఁగాక నన్నొంటినిచటడించి
      యఱుకఁదలఁచిన నుసుఱులు తొఱఁగుదాన.

చ. అనిననలుండు చానఁగనుయల్లన నుట్లనునొంటినిన్నుఁగా
      ననునెనరేదిడించియెలనాగరొయేగుదునేకడిందికీ
      డెనయఁగనీడ నిన్నునిచియేగఁదలంచినఁదొల్లినిన్నుఁనేఁ
       గొనిచనుదెంతునేయిటకుఁగుందకు నేయెదనించుకేనియున్.

క. అనియూరార్చునొక్కటఁ
      జనిఁయాతఁడుకానను నడుచక్కనినొకచోఁ
      దనరెడిలోఁలోగిలి యొక్కటి
      కనుఁగొనిచేరంగఁజనియెఁగలికియుఁదానున్.