పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

క. చుక్కలఱేనిని దాలిచి

    యెక్కుడుగన్నునను నగ్గియెగయఁగఁగొటికల్
    చక్కడఁచి సిరులఁజెలఁగెడు
   జక్కులరాయనియనుంగు సంగడికాఁడా.

గీ. అల్లజడదారి యాక్రీడియనాతో

    నిట్టులనెనట్టు దొరనేలయెల్లనోడి
    కట్టుగుడ్డలతోలేచికదలినంత 
   జరిగినదియెల్ల నెఱిఁగింతు జాలిగదుర.

ఉ. అంతనలుండునాగడియ నచ్చటనుండక యూరుదాఁటియొ

    క్కింతయునళ్కు లేక నగరెల్లఁగనందిగ నాళులుండియా
   చెంతకు నేరునుందఱియఁజేరకయుండుట చూచి కానకా
   యింతిని దోడుకొంచుఁజనియెంగల చుట్టలు గుందుచుండఁగన్.

గీ. ఊరిదరికాననింతితో నుండియతఁడు

   తాళఁగారాని యాకఁటఁదలఁకుచుండి
   కనుఁగొనెఁగడాలు ఱెక్కలజెలంగు
   ఱెక్కదారుల రెంటిని నొక్కచోట.

గీ. అట్లుగనియాతఁడెదలోన నాసఁజెంది

    కలిక తననెలుక ఁదొరంగికట్టుచీర
   ఱెక్కదారులుతన చేతఁజిక్కననుచు
   నెగర వేసిన నదిగొంచునెగసెఁ జదల.

క.కోరిక నింగినిజనుచుం

   దారేనేలయును సిరియుఁ దరలనఁడచియీ
   తీరుననిట కేతెంచిన
   సారెలగుటతెలియఁజేసి చయ్యనసరిగెన్.