పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచననైషధము

క. కౌనుననల్లనితోలుం
   జానగుజింకగలకేలుఁజక్కనియాలుం
   గాననితలజూలున్ జిగు
   లీనెడుతలకాయచాలునెసఁగెడుదంటా.

మాలిని. తిగకొటికలదాయాలెల్లయేఱున్నరాయా
     సెగకనుగలదంటా చఁదుఁగొన్నట్టిజంటా
     సొగసులతలకట్టాసూడులంగొట్టుదిట్టా
     జిగియరచెలిఱెఁడాచిల్కారారౌతుసూడా.

గద్య.

ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితసగోత్ర కందుకూరివంశపయః

       పారావార రాకాకైరవమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర
          సుజనవిధేయ వీరేశలింగనామధేయప్రణీతంబైన
             శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచన నైషధంబు
                   నందుఁబ్రధమాశ్వాసము.