పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/454

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషదము

 గీ. ఆంతలోన నలుండునునింతిఁగొనుచుఁ
దగినచుట్టలఁదోడ్కొని తనదునగరు
కొన్నినాళులకెల్లరఁగూడిచొచ్చి
యొన్నరానితేజున నేలయేలుచుండు.

సీ. కలియునుజనుదెంచి కడఁకతోనలునకుఁ
గీడుసేయనదను గూడుకొరకు
దద్దయురో యుచు నెద్దియుఁగానక
యెదలలొనఁగుందుచు నెడరుసేయఁ
దరిగాకనిచ్చలుఁ దరిఁజేరియాతండు
చేసెడునీగిని జేరకుండి
యొకనాఁడెరుంగక యొడయండు నీరుతాఁ
కఁగఁగవ కేగి తాఁగాళ్ళుకడుగ
నెరుఁగకుండినతరిఁజొచ్చి యిచ్చనలరి
యొక్కదాయచక్కటికేగి యుక్కు గలిగి
నలునిసిరియెల్లజూదాన నళుకుడక్కి
యొడుచుకొననీకుఁ దోడౌదుఁ దడయకనుచు.
    
ఉ. తానొకజన్నిగట్టగుచు దారినిదోడయి యేగుదెంచి న
న్నూనినగోర్కినేలుదొరయుక్కున నేఁడరుడెంచె నిన్నుఁజూ
దానఁగడంగిగెల్చి సిరితద్దయుఁగెగొన నంచునాడినన్
లోనరుదందియంతట నలుండుకలింగని యల్లనిట్లను౯.

క. జూదఱికెగ్లగునై నం
గాదనఁదగునయ్యనాకుఁ గడుశొనియాడం
గాఁదలఁచిననన్నుఁగన్గొన
నీదొర యిట కేగుదెంచి నిన్న నిచిసచో౯.