పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్దాంధ్రనిరోష్ట్యనిర్వచన నైషధము

క. దండులనెల్ల నుగడచితి
నిండుగ జేజేలయాన నేనిచ్చటికి ౯
దండిగ నే తెంచుటతా
నొండొకఁడింతయు నెఱుంగకుండఁగఁలికీ.
  
గీ. అనిన జాననీ తెఱగేది యనుచునడుగ
నిచట నెద్దియొయెఱిఁగించితిం తదనుక
నింకనైనను నీ జాడయింత నా కుఁ
దెలియ జేయంగఁదగునన్న ఁగలికికతఁడు.

గీ. నెలఁత నేను నలుండను నేల ఱేడ
నెట్టులనైనను జేజేలు గట్టిగాను
నెడఁదఁగోరునట్లేను నిన్నడగుకొనఁగ
నేగుదెంచినాఁడనునాతియట్లుచేయు.

క. నెనరున జేజేలఁ గొనుట
ననునేలుట గానఁగల్కి నా యెడలం గ
ల్గినగాది లితో నొక్కనిఁ
గనుఁగొన్న నుజాలు గట్టిగానలుగురిలో ౯

గీ. చేడెనాచేఁతలనురి త్త సేయనె
యనిన సిగ్గునఁ దలకుంచి యంచచేత
నతని నెఱిఁగియున్నది కాన నలరి యిచ్చ
నెట్టకేలకు నల్లన నిట్టులనియె.

సీ. జేజేలకును జోత సేయంగఁదగుఁగాక
కోరంగఁజనునయ్య కొంకులేక
కోరనేర్చునెలేడి కొండంత యేనుఁగుఁ
జెల్లునే నాకు జేజేలఁగోరఁ