పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొట్టు""కూరోయితోటకూర" మొదలగుమాటలనుసహజ మధురస్వరముతోపలుకుచుండును. ఆదూలమునకేమఱికొంత దూరమునరామాయణము మొదలయినతాటాకు లపుస్తకములుత్రాళ్ళతో వ్రేలాడఁగట్టఁబడియుండును. ప్రొద్దుననేనిద్రలేచిరుక్మిణి చిలకనుపంజరమునుండి తీసిచేతిమీఁదనెక్కించుకొని "చేతిలోవెన్నముద్ద "మొదలుగాఁగల పద్యములనుసహితము నిత్యమునునేర్పుచుండును. ఆకాలములోఁదఱచుగా స్త్రీలుచదువుకొను నాచారములేకపోయినను, రాజశేఖరుఁడుగారుతనకుమార్తెమీఁదిముద్దుచేతిదానెరుక్మిణికిక్రొత్తపుస్తకమును అన్యసాహాయ్యము లేకుండనర్ధముచేసికొను శక్తిగలుగునంత వఱకువిద్యనుచెప్పెను ఆమెస్వభావముచేత నేతెలివిగలదగుటచే విద్యకూడ దానికి సాయమయి చిన్నతనములోనే యుక్తాయుక్తివివేకమును జ్ఙానమునుకలదియాయెను. తండ్రి యామెకు చదువుచెప్పుటచూచి యసూయచేత నిరుగుపొరుగులవారు చాటున గుసుగుసలాడు కొనిరిగాని, రాజశేఖరుఁడుగారు ధనికులగుట వలన నేమియుఁబలుకు సాహసింపకపోయిరి. అట్లనివారు బొత్తిగానూరుకున్నవారుకారు. పెద్దవాఁడని రాజశేఖరుఁడు గారుగౌరవముతోఁ చూచుచుండెడి యొకయాప్తబంధుని మెల్లఁగాబ్రేరేపించి, ఆయనచేతాందఱునుసభలోఁ గూర్చుండియుండగా "నాయనా!మనయింట ఆఁడుపిల్ల్లలను జదివించు సంప్రదాయములేదే, మనరుక్మిణినేలచదివించెదవు? "అనిపించిరి. రాజశేఖరుఁడుగారు విద్యవలని లాభములనెఱిఁగిన వాడగుటవలనను, స్త్రీవిద్యయే శాస్త్రమునందును నిషేధింపఁబడియుండక పోవుటయు పూర్వపుపతివ్రతలందఱు విద్యావతులయి యుండుటయు నెఱిఁగినవాఁడగుట వలనను ఆవృద్ధుని వాక్యములను లక్ష్యముచేయక స్త్రీవిద్యాభ్యాసమునకనుకూలముగాఁ గొన్ని స్మృతివాక్యములను జదివి మీ