పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్వాసము

<poem> అట్లునాతిఁగన్న యంతట నాతండు ఱిచ్చఁజెందికోర్కె హెచ్చుఁ జెంద నొడలు తెలియక యొక్కింతత ఱిసోలి యలరు గోలలకును గలుగుచుండ.

ఉ. అద్దిర యీతడీడఁ దనయాఱని తేజున నెల్ల చోటులం దద్దయుఁగ్రాల జేసెను నితం డలచందుడొ యాతనల్లుఁడో సిద్దులికేల యెల్లరును జూడుఁడు కన్నులనంచునానతో గద్దియలొక్కటండిగిరి గ్రక్కున నంప నెలంత నెచ్చెలుల్.

ఉ. కనియనెలంతయు న్నలునిఁ గంచుని గేగఁగఁజాలునట్టి చ క్కనినెఱనీటిగాని నటికాంచి యెదంగల నానయంతయుం జన నొనరించి కోర్కులెదసందడి నేయఁగ నాస హెచ్చఁగాఁ దనదు చెఱంగుదిద్దుచును దద్దుయుఁ దేనియలొల్కనిట్లను ౯.

ఉ. ఎచ్చటనుండి రాకయొకొ యెట్టులుదండులఁ దాఁటఁగల్గెనో యెచ్చటనున్కియో యిటకు నీకరణింజనుదేర నేలయో హెచ్చిన కోర్కినీదు తెఱఁగెల్లను దాఁచకయున్న యట్లుగా నిచ్చట నానతీయఁదగు నించుకనాకయి సైఁచి క్రన్ననన్.

క. నిన్నుఁగనినంతనుండియు నన్నెంతయు నేఁచఁదొడఁగె నల నెల్ల యల్లుం డెన్నఁడు నినుఁగనియెఱు ఁగను జెన్నగునీ తెఱఁగెఱుఁగఁజేయంగఁదే.

చ. అనుటయు వీటియేలికయు నగ్గియు ఁ దెల్లనిహత్తి నెక్కురౌ తును నెఱదున్నయెక్కుడును దొయ్యలిరో యిటకేగుదెంచి యొ య్యిన నినుఁగై కొనందలంచి యయ్యది నీకెఱుఁగంగఁజేయ న న్ననిచిరికానఁ గోరుకొను నాతిరొ నల్గురిలోన నొక్కనిన్.