పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్థ్యనిర్వచన నైషధము

 
ఉ . అంచయునచ్చటుంగదలి యంతయునొంటిగ జేనితోనెఱిం
గించితనంతటంజనియే నిచ్చట నంతనలుండునొంగియొ
క్కించుక చిల్కతేజిదొర హెచ్చుహళాహళికిన్నిలంగలే
కంచెయెఱుంగఁజేసిన యుయారినిలోపఁదలంచి యిట్లను౯ .

ఉ .ఎన్నఁడుచూడఁగల్గునొకొ యింతిని జెన్నెసలారఁజూచినే
నెన్నఁడు నిండుకౌఁగిటను హెచ్చుగఁజేరుతినొక్కొ చేర్చియిం
కెన్నఁడుదాని సెజ్జనిడియించుక కూడదు నొక్కొకూడియా
కన్నియక్కోర్కితోనగుట కన్నులనెన్నఁడు చూడఁగందునో

క. చెలినటుతలఁచుచునలరుం
జిలుకుల సెగలంగలంగుఁజిలుకలకులుకుం
జలిగాలికలయుఁగోయిల
కొలకొలరొదలకు నెదఁదలఁకును గడునకుళుకున్ .

ఉ. నాయనుఁగున్నెలెంత తగునాయను నన్నెదనుంచి యేలు చా
నాయను నింకఁదాళఁగలనాయనుఁజక్కని క్రొత్తహ త్తిగు
న్నయను జాలియేదగునాయను రంగులుగుల్కు నంచయా
నాయను నకొగలంచనదనాయన నేఁచఁగదాయ నాయనున్ .

క. అచ్చటఁజందురునల్లుని
చిచ్చునఁగ్రాఁగుచునుదూలి చెలులుతలంచన్
నిచ్చలు నలుఁదలఁచుచుఁజెలి
హెచ్చుగనిద్దుర యుఁగూడు నెఱుఁగకయుండున్ .
 
చ. చిలుకలఁగొట్టు నెచ్చెలులఁజీటికిదిట్టుఁ గలంచుఁ దేఁటులం
దలఁకఁగఁ జేయుఁగోయిలలఁ దద్దయుఁ జందురునల్లుదూఱుఁ జు
క్కలదొర కాయనెండంగుకాఁకకుఁ దాళఁగలేక చొక్కుము
చలసలంచుం దలంకు నెదఁ జల్లనిగాలికిఁ జూచునల్ చెపల్ .