పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశాసము

గీ . అట్లుచేరియంచ యాయోలనాగకై
యించుకంతచూచి యిట్టులనియే
నోనెలంతనలుని యొద్దనుండియరుగు
దెంచితినిట కేనుదేలియనరయ .

క .రిక్కలరాయనిఁగందుని
జక్కులుదొరయనుఁగుఁగొడుకుఁ జక్కఁదనానం
జిక్కఁగఁజేసెడునేలిక
నొక్కింతయు నెన్నఁగలఁడె యొకఁ డీనేలన్ .

క .ఒడలెఱుఁగని సిరికొడుకుం
గడునలచు నుండునట్టి కడలియుసరియే
యొడయనికిన్ సొగసుననె
క్కుడులోఁతుననెంచి చూడఁగులుకులదొంతీ .

గీ .చందురనిసాటియౌ రాచచందుతోడ
నల్లరోహిణికిని నెనయైననీకుఁ
గోర్కులిగిరొ త్తఁగూడుటకూడదేని
నిదుసొగసెల్ల రి త్తయౌనెంచి చూడ .

మ .అనుడుందొయ్యలి దానికై తిరిగి యోయంచాతఱింజూచియా
యనదగ్గర నెట్లుగాఁదెలియనొయ్యంజాటి తాలాబ్గునే
చని యా యేలికయొద్దనన్నునుదగం జూటించనీనేర్చున
ట్లననుంగోరఁగఁ జేసియిద్దఱును జుల్కంగూర్చియేలంగదే

క .నాచదురు సొగసునుంజని
చూచినదెఱిఁగించినన్ను నూడిచడినన్
నీచేసివలగ్దెన్నఁడు
నాచకమొఁదలుచుకొందు నంచాయనుడున్ .