పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

క.అనితనలో ననుకొనికడు
నెనరుగలుగు నట్టుగాగ నెట్టననలునిం
గనుగొనుచునీరెలుంగున
ననియెం దనతెల్ల ఱెక్కలార్చుచుగణక౯.

సీ.ఎల్లచోనారాక కెదురుచు చూచునుండు
నెలంతుకయెదనెంతి తలకెనొక్కొ
యేరేయినన్నొంటి నిలుదాటనీకుండు
కన్నతల్లియదెంత కలగెనొక్కొ
తోడునీడలలాగు తొలగనిచెలికాండ్రు
సోలినన్ గనకెంతతూలిరొక్కొ
నేజేరుటయెఱింగి నెనరునజనుదెంచు
కొడుకులు తారెంతో కుందిరొక్కొ
కూడియెల్లరిది తెలిసికొన్నయంత
గటకటా తాతనీచేత గడకునేడు
చిక్కగాజేసె నేనెద్దిసేయుదింక
హాళినన్నేలు ఱేడనేననదనైతి.

మ.అనినందద్దయు జాలినొందుచునతండాయంచ జుట్టాలతో
జనగా నావతియిచ్చె దాననళుకుం జాలించిరాయంచయుం
దనకాఱేడొనరించు లగ్గునకుగా దానొండుసేయంగలో
ననయెత్తంగడునంతసిల్లి దొరచెంతంజేరి తానిట్లను.

గీ.ఆయనీయట్టిచాగికి నగునటంచు
నేనుజేసెడు లగ్గించుకైనగలదె
యైననానేర్చు నట్లుగనేనునొక్క
లగ్గుసేయంగ నెడదడలంచినాడ.