పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
మూడవ ప్రకరణమ

వచ్చి నీళ్ళుతోడుకొని పొవుచుందురు. మఱియు మధ్యాహ్నసమయమున చుట్టుప్రక్కల నొండు స్త్రీలు వారిని చూడవచ్చునప్పుడు, రాజశేఖరుఁడుగారు కచేరిసావడిలోఁ గూర్చున్న కాలమున లోపలి యాఁడువారు వెలుపలికి వెల్లవసినపుడును, ఆత్రోవనేవచ్చుచుఁబోవుచుందురు.

లోపలికుండునకు నాలుగుప్రక్కలను పనస కాయచేక్కననాలుగుస్తంభములున్నవి. వీధిచావడి కెదురుగానుండు పడమటిచావడిలొ లొపలికి పోవు నడిమి గుమ్మమొకటి యున్నది. ఆ గుమ్మమున లోపలికి ఁ బోవఁగానే చావడియొకటి కనిపించును. ఆ చావడి దక్షిణపు వైపున గుమ్మమొకటి యున్నది. ఆ ద్వారమున లోపలివెళ్లిన రాజశేఖరుఁడుగారు బరుండు గదిలోఁ బ్రవేశింతుము. గదిలొనుత్తరపు గోడ పొడుగునను దూర్పునుండి పడమటకు పందిరిపట్టె మంచము రాతిదిమ్మల మీఁద నాలుగుగాళ్ళనుమోపి వేయబడియున్నది. మంచమునకు చుట్టును దొమతెరయును జలరును దిగవేయఁబడియున్నది. పందిరిస్తంభములకు నడుమును లక్కపూసిన కొయ్యపళ్ళెములను బరిణెలు నుండెను. పందిరికి మధ్యగా లక్కకాయలను పువ్వులను గల చిలకల పందిరియొక్కటి వ్రేలాడుచుండేను. గొడాలకు సుద్దతొ వెల్లవేయఁబడి యుండెను. గోడలపొడుగునను రుక్మిణియుతల్లియు నోపికచేసినట్టిన గోడసంచులు తగిలించఁబడి యుండెను.ఆ గోడసంచులకు కొంచెము మీఁదుగా గుడ్డ చిలుకకు దారములతో త్రాళ్ళకు కట్టబడి గాలికి సుందరముగ కదులుచుండును.గోడకు పెద్దమేకులు కొట్టి వానిమీఁదఁబెట్టిన బల్లమీద కొండపల్లి బొమ్మలును లక్కపిడతలును గది కలంకారభూతముగ నుండెను. గోడ