పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/429

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము


పుత్రుఁడైన హనుమంతుఁడయినందుకు సందేహము లేదు. ఆతఁడు హనుమ@ంతుఁడే కాకపోయినచో శతయోజనాయామమయిన సముద్రము నొక్కయంగును దాఁటుటకు మఱియొక్కనికి సాధ్యమగునా? కాదు మన పెద్దలు చెప్పినట్లుగా నతఁడు రావణాసురుని కాష్ఠమారి పోకుండునట్లుగా ప్రతిదినము తాను డంతధావనము చేసికొన్న పుడకల సందు వేయుటకు పోవుచుండును గాన నేఁటి యుదయమున నన్ను జూచి జాలిదలచి పాపలేపము లేని నేను రాక్షసుల దేశమనుండి రాలేనని యిక్కడ తెచ్చి విడిచినాడు. నేనీ యడవిలో ఘాతుకమృగములు వాఁతబడక బ్రతికి యిచ్చటివారి యండఁజేరఁ గలిగినపక్షమున, రెండు మూఁడు మాసములలో వారిభాష నేర్చుకొని తరువాత నా కధను మీకు మహాత్ములచేతఁ బంపెదను.



..సంపూర్ణము..