పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

 వేయఁబడియున్నవి. అందు దశావతారములును మాతమే కాక, కృష్ణుఁడు గోపికల వలువలు నెత్తికొనివచ్చి పొన్నచెట్టు మీఁదఁ గూర్చుండి వారిచేఁ జేతు లెత్తి మ్రొక్కించుకొనుచున్నట్టును, వెన్నలు దొంగిలినందు కయి తల్లి రోటను గట్టిపెట్టి దాని నీడ్చుకొని పొయి మద్దులఁ గూలఁద్రొచినట్టును, మఱియు ననేక విధముల కృష్ణ లీలలుగల పట్టములును, కుమారస్వామి తారకాసురుని జంపుచున్నట్టును, పార్వతి మహిషసురుని వధించుచున్నట్టును, శివుఁడు త్రిపుసంహరమును చేయుచున్నట్టును నున్న సంబంధము లయిన పటములును, విఘ్నేశ్వరుడు ,సరస్వతి, గజలక్ష్మి , చతుర్ముఖుడు మొదలుగాగల మఱికొన్ని పటములును, గొడల నలంకరించుండెను.ఉత్తరపు ప్రక్క చావడిము ఈ విధముగానే యుండును. గాని గోడ కొక్కగుమ్మముమాత్రమే యుండి, అది తరచుగా మూయఁబడి యుండును. ఈ చావడిలో రెండు మూడు పాతసవారీ లెప్పుడును వ్రేలాడఁ గట్టఁబడి యుండును. రాజశేఖరుఁడుగా రప్పుడప్పుడు గ్రామాంతరములకుఁ బోవునప్పుడును పెద్దమనుష్యు లెవ్వరయినఁ దఱచుగా నెరు వడుగునప్పుడును ఉపయోగపడుచుండు క్రొత్త సవారీ మాత్రము ఋరకా వేయఁబడి చావడిలొ క్రిందనే పడమటిగోడదగ్గఱఁ జేర్పఁబడి యుండును. ఈచావడిగోడ కున్న తలుపు తీసి యుత్తరపు పంచపాళిలోనికి సోయినతోడనే దొడ్డిలొ నుయ్యియొకటి కనఁ బడును ఆనూతిపయి నుండుగిలకలు కీచుధ్వని చేయుచుండ నిరుగుపొరుగులవారు సదా నీళ్ళుతోడుకొని పొవుచుందురు. ఆనూతికి పడమటివైపున ధాన్యము నిలువ చేయు గాదెలు రెండు లోగిలిని చేరక ప్రత్యేకముగాఁ గడ్డింపఁబడియున్నవి. నూతికి సమీపముగా వీధిలొనికి పాణిద్వార మొకటియున్నది ఇంతకు మునుపు రుక్మిణివచ్చిన దాద్వారముననే. ఆదారినే యిరుగుపొరుగు వారు