"అమ్మా! వచ్చుచున్నాను" అని దూరము నుండి యొకధ్వని వినివచ్చినది.
"ముందుగా నీవిటురా. నీపని తరువాత చేసికోవచ్చునులే." అని మరల త్రిజటతల్లి దానిని పిలెచెను. "పని కావచ్చినది. చేసికొని వచ్చెదను". అని దూరమునుండి మరల ధ్వని విననచ్చెను. "అది యెంతసేపటికిని రాకున్నది. నేను పోయి తీసికొనివచ్చెను."అని త్రిజట తల్లి నడిచెను.ఆమె కాలి చప్పుడు వినఁబడఁగానే నాకు భయమదికము కాఁజొచ్చినది.ఇంతలో నెవ్వరో లోపలికి వచ్చునట్లు మరల కాళ్ళ చప్పుడయినది. ఆయనడుగుల చప్పుడు చెవినిబడఁగానే నాపాలిటికి మృతదేవత్యుయైన తాటకయే వచ్చుచున్నదని నాగుండెలు తటతట కొట్టుకొన నారంభించినవి. అది రాక్షసుల కేకాంతమైనను వారి గుసగుసలు సూక్ష్మశబ్దగ్రహణశక్తి గల మనుష్యుల శ్రవణేంద్రియములకు స్పష్టముగా వనఁబడుచునే యుండును. అందుచేత చెవియుగ్గి వారి మాటల నాలకిఁప మొదలుపెట్టితిని.
"ఓహిడింబీ! రాత్రినీవుతెచ్చినవాలఖిలుఁడీపెట్టెలోనున్నాఁడు. అమ్మతో నిందున్నదియెలుకయనినేనుబొంకినాను." "ఇప్పుడు నేనేమి చేయవలెను?"
"ఇతనికపాయముకలుగకుండకాపాడియేలాగుననైననునీవీతనినినాకడమరలఁజేర్పవలెను. నాఁటిరాత్రితెచ్చుటతెచ్చుటగాదు.నేఁటిపగలుతెచ్చి నీప్రాణసఖియైనత్రికటప్రాణములునిలుపవలెను.
"ఓత్రిజటా! నీనిమిత్తముయి నాప్రాణములయిననిచ్చెదను. ఆరాక్షసి ముండకన్నులు గప్పిమరల తెచ్చి నీప్రియవల్లభుని నీకెట్లు సమర్పింపఁ గలుగుదునో నాకుతోఁచకున్నది."