పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

చండి?"అనికలుపుచునొకయంగనలోపలికివచ్చెను.ఆమెవచ్చుటచూచివెంటనేపెట్టెమూఁతవైచితాళమువేసిత్రిజట"అమ్మా! యెలుకనన్ను కఱువలేదు. నాచీర నిమిత్తము పెట్టెమూత తీయఁగా పెట్టెమీఁదనున్న యెలుక నాచేతి మీఁదినుండి ప్రాఁకి యీపెట్టెలోనుఱికినది. నేను భయపడి కేకవేసిపెట్టెమూఁతవేసినాను. "అనిచెప్పెను. "మంచిపనిచేసినావు. ఎలుకల బాధమనయింట విస్తారముగానున్నది. ఎక్కడిదోచూరెలుక యొకటిమంగదిలో ప్రవేశించిదండెము మీఁదిబట్టలన్నియు కొట్టివేయుచున్నది. నేఁటికి దానికాయువు మూడిపెట్టెలోదూఱినది. పాఱిపోవునేమోపెట్టెతలుపుతీయకు పెట్టెనెత్తిమీఁదబెట్టి మనతాటకచేత నావలికిఁబంపెదను. "అనియారెండవనుందరి చెప్పెను. వారి సంభాషణమువలన నేనాకాంతత్రిజటతల్లియని గ్రహించితిని. అప్పుడు తల్లిబిడ్డలకు మఱియు నీక్రిందరీతిని ప్రసంగముజరగెను.

బిడ్డ-అమా!ఈ పెట్టెతాటకచేత పంపరాదు. అదియిందులోని యెలుకను చంపివేయును.
తల్లి-అమ్మాయీ: నీకిష్టములేని యెడల చంపక దీనిని దూరముగాఁగొని పోయి యూరి బైటవవిడిచి రమ్మని నేనుతాటకతోగట్టిగాచెప్పెదనులే.
బిడ్డ-నీవెన్నిచెప్పిననుతాటక దీనినిచంపకమానదు. అదిక్రూరురాలు దానిమాటనేనునమ్మను. నాసఖియైనహిడింబిని కూడవెంటఁబంపి దూరముగా వదలిపెట్టించెదను- ఓహిడింబీ! ఓహిడింబీ! వేగిరమురా.

తల్లి-ఇష్టమున్నయెడిలహిండిబిని కూడఁబంపవచ్చును -ఓతాటకా నీచీపురుగుట్టవిడిచి ఇటురా. వీధి యరుగులు తరువాత తుడువ వచ్చునులే.