Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                    లంకాద్వీపము

వుఁడు లోపలికివచ్చి దుర్వాసనను కొంత తొలగించి భక్తుడైన నాక పరిమితసుఖప్రదాయకుఁడయ్యెను. ఇంతలో త్రిజట పెట్టెవద్దఁ నూరుచునుండి లోపల తొంగిచూచి బట్టమడతమీద మడుగు కట్టియున్న రాక్షసుని రక్తప్రవాహమును గని యీయొఱ్ఱమఱక యెట్లయినదని వాసన చూచి యీనల్లి పోతుదని పలుకుచు మత్కుణాసురుని కళేబరము తీసి దూరముగా విసరి వైచెను. ఆమె విగ్రహమును జూచి భయపడి యొక మూల నొదిగియున్న నన్ను చేతితో బట్టుకొని కొంచెము పయికెత్తి "ఓవాలఖల్యా! ఇంతటనైనను నీవు స్తూలరూపమును ధరించి నామనో రథమును సఫలము చేయుము. రాక్షసాంగనా పరిగ్రహము వలన నీకు పాపము లేదు. పూర్వము మీ భూమిలోకములో చంద్రవంశపు రాజయిన యయాతి వ్రుషపర్వుడను రాక్షస రాజ కూతురైన శర్మిష్ఠను వరించి వంశకతయైన పూరుఁడులోనుగాఁగల కొడుకులను గన్న వార్త మిపూరాణముల యందు విన లేదా? మాఱుపలుకవేమి? అని తనవ్రేళ్ళుతో నాప్రక్కలు నొక్కను. నే నాబాధకు తాళలేక యింతకుముందే మత్కుణాసురునితోడి సంగరమునందు నళానళని దంతాదంతిని పోరాడి గడిదేఱియున్న రసికుఁడ నగుటచేత నాకన్య యొక్క పాణిగ్రహణముచేసి యామృదుహస్తముమిఁద నళక్షతి దంతక్షములను జేసితిని. నవోఢయడగుటచే నాసుందరినారసికత్వమును గ్రహింపలేక కెవ్వున కేకవేసి చేతిలోనున్న నన్ను క్రిందవిడిచి పెట్టెను.భాగ్యముచే నేను బట్టమిఁదపడఁబట్టిగాని యంతయెత్తునుండి పెట్టె కొయ్యమిఁదనేపడుట తటస్ధించినపక్షమున నాతల రెండుప్రక్కలయి యుండును.ఆచిన్నది కెవ్వున కేక వేయగానే లోపలనుండి యెవ్వరో"అమ్మాయీ.ఆట్లు కేకవేసితివేమి? అని యడిగిరి. "మఱెమియు లేదు ఎలుక" అనిత్రిజటయుత్తరమిచ్చెను."ఎలుక నిన్ను కఱిచినదాయేమి? ఎలుకకాటువలన విష మెక్కను.ఎక్కడ కఱి