పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు

తెలివి తెచ్చుకొని మరల శత్రువువంకఁజూచితిని. శత్రునప్పటికిని జావక లన నాడించుచుండెను. అగ్ని శేషమును ఋణశేషమును శత్రు శేషమును నుండుఁకూడదని రాజనీతివేత్తలు చెప్పుట స్మరణకుఁ దెచ్చె కొని నేనప్పుడు నారెండు చేతులతోను రాక్షసుని రెండు డెక్కలను బట్టుకొని శ్రీకృష్ణులవారు బకాసురుని చీల్చినట్టు నిలువినఁ జీఱఁజూచి నేగాని యీలోపలనే నాభుజబలాతిశయముచేత వానిడెక్కలు నడి మికి విఱిగిపోయినవి. అంతట రాక్షసుఁడువిగతాసుఁడుయినాఁడు. అప్పుడు దేవతలు నామీఁద పుష్పవష౯ము కురిసియుందురుగాని పెట్టె లోనుండుటచే దానిని జూచి యనుభవించు బాగ్యము నాకన్నులకు కలిగినదికాదు. మహాపుణ్యప్రదమైన యీమత్కుణాసురనిజయకథను శ్రద్ధతోఁ జదివినవారును భక్తితో విన్నవారును పద్యకావ్వమునుగా రచించి లోకమున ప్రసిద్ధపఱిచినవారును మూఁడులోకములయందును మత్కుణబాధనుండి విముక్తులగుదురు.

శ్ల్లో. మవర్ణాది మకారాంతిం సతం కువణ౯ సంయుతం అదంతణకారోవేతాం ఏతన్మంత్రం విదుర్బుధాః.

పరమ గోప్యమైన యీమత్కుణ మంత్రమును పరమవిశ్వా సముతో నిత్యమును జపించువారికి సమస్తవబధలును తొలఁగును.

మత్కుణాసురవధానంతర మారాక్షసునిదేహమునుండి యొక విధమయినదుగ౯ంధము బయలువెడలి నాఘ్రాణేంద్రియమునకుడుసాన మెట్లాయని నాలో నేనాలోచించు చుండఁగా నింతలో మారణకోలాహ లముచేత మెలఁకువవచ్చియో పెట్టెలోని బట్టను దేనినైనతీసికొనవలసి వచ్చియో మఱి యేహేతువుచేతనో త్రిజట మంచము దిగివచ్చి పెట్టె తాళముతీసి మూఁతపయి కెతైను. అందువలన పయినున్న వాయుదే