పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

400 సత్యరాజాపూర్వదేశయాత్రలు

  
సత్య_అమ్మా!నీకు నామిఁదఁగల యనుగ్రహముచేత నేను నిజముగానేధన్యుఁడనయినాను. నాపేరు సత్యరాజాచార్యూలు.నేను ఋషివర్యుఁడను పేరునకర్హుఁడనుగాను.
 
త్రిజ_నీపేరిదియైనను గానిమ్ము:నీవొక్కఋషివనిమాత్రమే కాక యంగుష్టమాత్ర శరీరులయి నిరంతరమును సూర్యుని రధముచుట్టును తిరుగుచుండెను క్రతుపుత్రులైన యఱువదివేల వాలఖిల్యులలో నొక్కఁడవనికూడ నేనెఱుఁగుదును.ఇఁకనావద్ద నేమియు దాఁచఁబోకు.
     
సత్య_మిరట్లన్న నేనేమి చెప్పుగలను!
     
త్రిజ_నేమియుఁజెప్పునక్కఱలేదు. ఇకరాత్రియెంతోలే. మాటలతో వృధాకాలహరణము చేయక కార్యాంశము వినుము. నీయెక్క మహామహిమలను నాచెలికతైలవలన విని నీకు వలచి చిక్కినదానను. గాంధర్వవిధిని వరించి యిప్పుడే నన్ను చరితాధరాలిని జేయుము.
     
సత్య_అటువంటి మాటలు మిరూ సెలవియ్యకూడదు.
    
త్రిజ_దీనురాలనయి ప్రాధించుచున్న నాకోరిక వృధ పుచ్చుట మికు ధర్మముకాదు. మిఋషులయెక్కయు దేవతల యెక్కయు గుట్టంతయు నేనెఱఁగుదును. రాక్షస స్త్రీలమాట యటుండఁగా తిర్యగ్జంతువులతో సంభోగించుటకు సహితము సంశయింపలేదు.
    
  
సత్య_వంశయింపనివారెవ్వరు!మహషులా!
      
త్రిజ_ఒక్క మహషులు మాత్రమేకాక వారి దేతలను సంశయపడలేదు. మందపాల మహషి లావుకపిట్టతో సంభోగించి సంతానము కనేను. విభండకమహషి లేడిని పొందిఋశ్యశృంగుడను కొడుకును గనెను మివాయు దేవుఁడు కేసరియను వానరుని భార్య వలన హనుమంతుని గనెను. సూర్యఁడశ్వమునుజేరి యశ్వనులను