లంకాద్వీపము 399
యది మాంసభక్షకజంతువు కాదని యంతరంగమునఁ గొంత సంతోషించినాను. అప్పుడొక్క మూలుగు మూలిగి నన్నుఁ గొసివచ్చిన జంతువు నన్నునట్టింట దిగవిడిచి తానొక కన్నములో నుండి యానలికిఁజోయెను. అంతట నమస్తాభరణభూషితు రాలయియున్న యొక కాంతమంచుము మిఁదినుండి దిగి వచ్చి మనపిల్లలు చందనపు బొమ్మను పయికెత్తినట్టుగా నన్ను తనకుడిచేతిలో పయికెత్తి రెండవచేతిలోని యంగవస్త్రముతో నాశరిరమంతయు తుడిచి నన్ను తన మంచమిదఁగూరుచుండఁబెట్టి తానును నాకెదురుగాఁగూరుచుండెను. కాళికాశక్తివలె వెదురుఁగూరుచున్న యామెమొగము జూడఁగానే నామనస్సులో పరిపరిలాగు నాలోచనలు పుట్టఁజొచ్చినవి. నాశత్రువు లెవ్వరైన నన్ను బాధించిచంపుటకయి యిట్లు తెప్పించి యుందురని మొట్టమొదటతోఁచినది. తరువాత నొకటి తరువాత నొకటిగా ననేకాలోచనలు కలిగినపిమ్మట కట్టకడపట రాక్షసాంగనయైనయామె నన్ను మెహించి బాణాసురుని కూఁతురైన యుష్యాకన్య యనిరుద్దని చిత్రలేఖచేతఁదెప్పించుకొన్నట్లుగా నన్నీ మూషక రాజుచేతఁ దనయెద్దకు రప్పించుకొని యుండనాయని సంశయము తోఁచినది. తరువాత మాయిరువురకున నడిచిన సంభాషణమును బట్టి నాయీ కడపయూహయే సిద్ధాంతముయినట్టు మిరిప్పుడే తెలిసికొనఁగలరు. ఆకాంత యద్భతపడి చూచుచున్ననాకు తన్ను తెలుపుకొని,తనపేరు త్రిజటయగుట చెప్పి యిట్లనియెను...........
త్రిజ - ఓరుషివర్యా !నావంక వెఱగుపడిచూడకు. ముల్లోకములను జయించిన సార్వభౌముని వంశములోని రాజ కన్యకు జీవితేశ్వరుని గాఅవించి ధన్యుని చేయుతలంపున నిన్నిటకు రావించితిని గాని హానిచేయుతలంపున రప్పింప లేదు ఇంద్రుని జయించి యింద్రజిత్తని పేరుపొందిన మేఘనాదుడును రావణపుత్రునకు నేను ముని మనవరాలును.
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/405
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది