పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/403

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

ఈశ్వరాంశసంభూతుని గాభావించి బహుకరింపఁ జొచ్చినను, జ్యోతిశ్శాస్త్రమునురూపుమాపదీక్షవహింప బద్దకంకణులయివిఫల మనోరధులయిన నవనాగరికులునన్ను ద్వేషించినాయశస్సునకు భంగముకలిగించుటకును నాకపాయము కలిగించిటకును నానావిధములఁబ్రయత్నించుచుండిరి. ఆరాక్షసుల క్రౌర్యము నెఱిగినాయాజమానుఁడఁయిన మహాకాయుఁడుగారు నాటినుండియునన్నుసభలకుఁ దీసికొనిపోవుట మానివేసిరని యీవఱకేచెప్పియున్నానుగదా; ఆపదలు రానున్నకాలము నందంతఃపురములో దాఁచి సహస్రభటులనుకావలియుంచి ననురాకమానవు. ఆపదలు రారానికాలమునందు సముద్రమధ్య మునందుఁబడవైచిననురావు. నాయజమానుఁడు తనయింట నన్నెంతసురక్షితము గానుంచికాపాడిచుండినను, ఒకనాఁటిరాత్రి నానొక్కఘోరవిపత్తుసంప్రాప్తమయినది. ఓచదువరులారా! విధివిధానమప్రతివిధానమగుట తెలిసికొనినా విషయమయి మీరుచింతిలఁబోకుడు.

ఒకనాఁటియధ౯రాత్రమునందు నేను నాపానుపు మీదసుఖ నిద్రచేయుచుండగా నానడుమెవ్వరోపట్టుకొని నొక్కుచున్నట్టయి యులికిపడిలేచితిని. లేచికన్నులు తెఱచిచూచు నప్పటికికేదో జంతువునన్ను నడుముమొదలుకొనిమె డవఱకును నోటఁగఱచుకొనిపోవుచున్నట్టుదీపమువెలుతురున కనబడినది కానియాజంతువేదో యానావాలుతెలిసినదికాదు. ఆభయములో నన్నువ్యాఘ్రమీడ్చు కొనిపోవుచున్నదనిభ్రమకలిగినది కానిప్రక్కలనుండిదానికాళ్ళునల్లగాకనపడినందున వెంటనే యాభ్రమనివారణమయినది. అటు తరువాతది భల్లూకమో వరాహమోనని తలచియరణ్యములో నుండదగిన యాజంతువులు నట్టింటికికెట్టువచ్చునా యనివిత్కరింపనారంభింపఁగా నింతలో నీటెతో పొడిచినట్లుగా వీపునకుకోఱయొకటి