పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/402

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశయాత్రలు

ధరించితిననిచెప్పుకొనఁజొచ్చిరి:
కోందఱునేను శుక్రాచార్యులగర్భమును చీల్చుకొనివెలువడిన
కచుని వలె దీఘ౯రోమునిగర్భగోళమును భేదించుకొని వచ్చియాతని నిమృతసంజీవని విద్యచేతమరలబ్రతికించితి ననిచెప్పుకొనజొచ్చిరి: కొఁదఱునేనుదీఘ౯ రోమునిపాదములుమొదలుకొని శిరస్సువఱకునునడిమికిరెండు చీలుకలుగాచీల్చితరువాత జరయనురాక్షసి జరాసంధునియధ౯దేహములనొకటిగా సంధించినట్లుగా రెండుఖండములను మరలనతికించి మంత్రప్రభావముచేత పునజీ౯వితునిజేసితినని చెప్పుకొనఁజొచ్చిరి. ఇట్టికథలన్నిటిని పూణ౯ము గావివరించినచో నొక్కపెద్దపురాణముకావచ్చును గానిస్వోపకష౯మునుజెప్పుకొనుట యిష్టము లేనివాడనగుటచే వానిని నేనభివణి౯ంచుట మానినాయపూర్వమహిమలను లోకోపకారాథ౯ముగా పురాణారూపమున రచియించియాచంద్రార్కముగా లోకమునవ్యాపింపఁజేసి మనంహషు౯లవలెశాశ్వతకీతి౯ని సంపాదించుకొనెడుపుణ్యమును భక్తాగ్రేసరులకువిడిచిపెట్టుచున్నాను. నాఁటినుండియు నన్నుదర్శింపవచ్చుభక్తులయొక్కయు భక్తురాండ్రయొక్కయు సంఖ్యదినదిననాభివృద్దియగుచు వచ్చినదన్న సత్యమును బుద్దిమదగ్రగణ్యులయినమీతోనేను విన్నవింపవలసియావశ్యకమేలేదుగదా?అయినను మీకింకొకసత్యమును మాత్రమిప్పుడువిని పింపవలసియున్నది. లోకములోమనుష్యుఁడుగొప్పవాఁడయిన కొలదినిగొప్పతనమొతోడఁ గూడకష్టములనుపెరుగుచుండును. భక్తులయిన వారుస్వప్రయోజన పరులయిస్వలాభముకొఱకశ్రాయించిపీడించుచుందురు: అసూయాపరులయినవారు పరోత్కష౯మునునహింపలేక యపవాదములనువేసిబాధించుచుందురు.

లంకాద్వీపమునందునందు ప్రాచీనాచార నిష్టాగరిష్టులయిన శిష్టులందఱునునన్ను సనాతనపదారములనుస్థాపింప నవతరించిన