పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

తరువాతనెప్పుడునునన్నేసభకునుదీసికొనిపోలేదు.ఓహిందూమహాజనులారా:మీవాఁడొకఁడుబయలుదేఱిదేశదేశములవెంటఁబోయియిక్కడమీకుప్రియతమైనజ్యోతిశ్యాస్త్రమునుస్థిరపఱిచియాచంద్రార్కమైనశాశ్వతకీ౯ని పొం దఁగలిగినందునకుమీరునునమందానందముపొందుఁడు.

ఆఱవ ప్రకరణము.

ఆమఱునాటినుండియు నాకీతి౯లంకాద్వీపమునందు దిగంతవిశ్రాంతముగా వ్యాపించినది. పడిపోవుచున్నజోతిశ్శాస్త్రమును నిలువఁబెట్టితినని విద్వాంసులు వేయినోళ్ళశ్లాఘింపఁజొచ్చిరి. జ్యోతిషమునుపునరుద్దరణము చేసిదేశమునకు మహోపకారము చేసినందునకయి కవీశ్వరులునామీద పాటలనుపద్యములనుజేసి ఈశ్వరునియపరావతారమునని నన్నుస్తుతింపఁజొచ్చిరి. ఇఁకనామిహిమలను విని యానందించి యింటిటనునాచిత్రచరిత్రమును కథగాఁజెప్పుకొనొచు పామరులు చేసినస్తోత్రపాఠము లకుపరిమితియేలేదు. పమరులనోళ్ళ నుండిస్త్రీలచెవులసోకి నూతులవద్దనునీళ్ళరేవుల వద్దనుజరుగుమహాసభలలో చిత్రవిచితముగాపెరిగి స్త్రీలనోళ్ళలోనుండి శాఖోపశాఖలుగావ్యాపించి యంతఃపురములుచేరునప్పటికి నామహిమలునిజముగా కోటిగుణతములయినవి. కొదఱునేనునింహకగర్భము లోఁజొచ్చికాయుముపెంచిన హనుమద్దేవునివలెనాకాయమును పెంచితినని చెప్పుకొనజొచ్చిరికొదఱునేను సురగర్భములోఁజొచ్చి యంగుష్టమాత్ర శరీరుడైబయలు వెడలినహనుమద్దేవుని వలెసూక్ష్మాతిసూక్ష్మమగురూపమును