పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

             394 సత్యరాజా పూర్వదేశయాత్రలు

దిగజాఱి బల్లమిఁద నాయధాస్ధానము చేరి మరల నగ్రాసనాసీనత్వము వహించి కూరుచుంటిని. నేనప్పుడారాక్షసుని నోతినుండి పయికి వెడలితినో ముక్కునుండి పయికి వెడలితితోచెప్పులేనుగాని మఱి యేయితర మార్గము నుండియు వెలువడలేడని మాత్రము దృడముగాఁ జెప్పుఁగలను. నేను పయికి వచ్చునప్పుటి కాదుష్టరాక్షసుఁడు మెతుకు గొంతుకఁబడి పలకఁబాఱినప్పుడు మన కగునట్లు క్రిందిగ్రుడ్డు మిఁదికిని మిఁదిగ్రుడ్డు క్రిందికి వచ్చినవాఁడయి యుక్కిరిబిక్కిరియి డగ్గుచు నెంతోనేపాయనపడెను. నిష్కారణముగా సజ్జన సంతాపము చేసినవారికాపదలు ఘటింపక యీశ్వరుఁడు సహించి యూరకుండునా, నేను సురక్షితముగా పయికి వెడలివచ్చుట చూచి సభాస్తారు లందఱును నామహిమ కత్యద్భుతపడి నేను నిజమయిన మహర్షినని నమ్మిరి. సూక్ష్మరూపుఁడనయిన నేను హనుమానునివలెతపోమహిమచేత స్ధూలరూపము నొంది యాదుష్టరాక్షసుని పొట్ట చీల్చుకొని పయికి రానందునకయి సభవారిలోననేకులు నాదయాగుణమును వేయినోళ్ళశ్లాఘించిరి. నాయజమానుఁడు నావద్దకు పరుగెత్తుకొనివచ్చి వాత్సల్యమూతో నాదేహము తడియొత్తి నాతడిబట్టలు తీసివేసేను. నామహత్త్వముచేత నాద్వీపమునందునాఁటినుండియు జ్యోతిశ్శాస్త్రము నిరపాయముగా స్ధిరపడినది.జ్యోతిశాస్త్రమే సత్యము కానిపక్షమున,కాదన్నువానిగర్బములోఁజొచ్చి వానిని ప్రాణావశిష్టునిజేసి నిరపాయముగా పయికి రాఁగలుగుట మనుష్య మాత్రునకు సాధ్యమగునా యని యెల్లవారును సంతుష్టులయిరి. మాపక్షమువారు తమవాదముగెలిచినదిని జయజయధ్వనులతో బయలు వేడలఁగానాఁటికి సభముగిసినది. ఇప్పుటివలె గుటుక్కునక మింగక యేక్రూర రాక్షసుఁడయినను నన్ను పండ్లనందునఁ బెట్టుకొని నమలివేయు నేమెయన్న భయముచేత మహాకాయుఁడుగారటు