ఈ సంపుటంలో ఉన్న పదెనిమిది పద్యమూర్తుల్లోనూ, నాలుగు పెద్దకావ్యాలు, ఒకటి ప్రబంధానుకరణం, మూడు ఆంగ్లకావ్యానువాదాలు, అయిదు హేళనలు, రెండు మతప్రమేయాలు, రెండు మహావ్యక్తి ప్రశంశలు, ఒకటి నీతి బోధ. పెద్ద కావ్యాలు నాలుగింటిలో మొదటిది "శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచననైషధము". ఇది మూడు ఆశ్వాసాలు. పెదవీ పెదవీ తగలకుండా (అనగా_ప,ఫ,బ,భ,మ అనే అక్షరాలు వాడకుండా), ఎక్కడా గద్యం రానియ్యకుండా, సంస్కృతపదం దొర్లనియ్యకుండా అందరూ ఎరుగున్న నలచరిత్ర లలితంగా సుగమంగా ధారాళంగా ఇందులో చెప్పబదింది. దమయంతి అనే మాటలో 'మ' ఉంది గనక, ఋతుపర్ణుడులో 'ప' ఉంది గనక ఆశబ్దాలు లేకుండా నలకథ నడిచిపోవడం చూడతగ్గదే కదా! రెండోకావ్యం 'రసికజనమనోరంజనము' ఇది నాలుగాశ్వాసములు. ఇది మూడుమూర్తులా ప్రబంధము_'ప్రబంధరత్నము' ఆదికాలం నించీ ఆంధ్రంలో ఉండే మహాప్రబంధాల మేలుజాడల మేళగింపు ఇందులో స్ఫురిస్తుంది. దీనికుండే మరో విశిష్టత ఏమంటే, ఇది కేవలం అచ్చతెలుగేగాని, సంస్కృతభాషా పటాటోపం కాదు. సంపర్కంగాని స్పర్శగాని ఇందులో చూడం. మూడోది 'శుద్దాంద్ర భారత సంగ్రహము ' అచ్చతెలుగులో మంచినీళ్లప్రాయంగా పద్యరూపంలో ప్రసంగం నదిచి మహాభారతకధ పూర్తిగా మూడాశ్వాసాలతో ముగియడమేకాదు. ఆంధ్రమహాభారతంలొలాగే అపరూపచందస్సులూ చివరికి మద్యాక్కదా కూడా ఇందులో పనిచేశాయి. నాలుగోది 'శుద్దాంద్రోత్తరరామాయణము ' ఇది ఒకే అశ్వాసము, అదేనా అసంపూర్ణం.
మొత్తంమీద నూట పదిహేను గద్యపద్యాలు గల ఏకాశ్వాప్రబంధము. 'అభాగోపాఖ్యానము ' ఇది సంస్కృతసమానభూయిష్టమై, పదప్రయోగంలోనూ వృత్తగమనంలోనూ పూర్వప్రబంధస్మారకమై, ఆంధ్రప్రబంధసామాన్యోపమీనాలకి కేవలం విజ్ఞోడుగాఉండే ఉపమానాలతో కూడినది తద్వారా హాస్యప్రధానమై ఒప్పే పద్యరచన.
'అధివిలాపము ' గోల్డ్ స్మిత్ అనే ఆంగ్లకవియొక్క ట్రావిలర్ అనే కావ్యానికి అనువాదం. యూరప్ లోని వేర్వేరు ప్రాంతాల స్థితిగగులు అందులో వర్ణించబడ్డాయి. అనువాదం ఎంతో ప్రౌడంగా ఉన్నది. 'జాన్ గిల్పిన్ ' రొవర్ అనే ఆంగ్లకవి కావ్యానికి పరివర్తనం. ఇది హాస్యప్రధానం. దీనిలోరిధి సుగమం 'కామెడీ ఆఫ్ ఎర్రర్సు ' అనేది షేక్ స్పియర్ నాటకానికి ద్విపదకూపంలొ అను