పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము


అప్పుడు నాకు గరుత్ముండు మింగిన కిరాతకాంత నుంచుకొన్న బ్రాహ్మణోత్తముని వలె గొంతుక లోనుండి మండి పయికి వత్తునాయని యొకా అలోచనకలిగినది. రామరావణ యుద్ధమునందు కుంభకర్ణుఁడు కపులను మింగినపుడు వారు నవరంధ్రములో నుండి యువెడలి వచ్చునట్లు వెడలివత్తునాయని యొక యాలోచనకలిగినది. కంఠ నాళమునుండి గర్భములో ప్రవేశించి యక్కడ జరుగుచుండు విశేషములనెల్లను కన్నులార చూచివచ్చి జీవించియున్న పురుషుని యుదరములోనే మేమి విచిత్రములు నడుచుచుండు నోతెలిసి సత్యము తెలియక చిక్కులుపడుచున్నయిప్పటి శారీరశాస్త్రజ్ఞలకు జ్నానోపదేశము చేయుదునా యని యొకయాలోచన కలిగినది. ఇట్లునాకప్పు డనేకములైనయూహలుత్పన్నములు కాఁగా దీఘ౯విచారముచేయక వేగిరపడి కార్యనిశ్చయము చేయుట బుద్ధిమంతుల లక్షణముకాదని యెఱిగిన వాడనయి దీఘ౯ముగా నాలోచించి, గర్భకుహరముప్రవేశించి నపక్షమునపవిత్రమైన మలద్వారమునపయికి వెడల వలసియుండును గానబ్రాహ్మణుఁడనైన నాకదితగదని శారీర శాస్త్రజ్ఞలకుపకారము చేయుపనినివిడిచిపెట్టి, శ్వాసకోశములను శోధించి వైద్యశాస్త్రజ్ఞల కుపకారము చేయవలెననినిశ్చయించి గొంతు క్రోవిలోనున్న పాణిద్వారమునఁ బోయితిన్నగానూ పిరితిత్తులలోఁ బ్రవేశించితిని. అక్కడ నాయిష్టదైనమైన ముఖ్యప్రాణదేవుడునాకు దర్శనమిచ్చి తనభక్తునినిట్లుచేసినందు నకయికోపముచేత నోయననన్ను తక్షణమేతనబలము కొలదిని బయికిఁ బంపివేసెను. వాయుబలము చేతనేనప్పుడా కాశబాణమువలె పయికెగసి బయలఁబడి యేప్రకారముగానో క్షణకాలములో నాతని శత్రువుల నడుమఁ జిక్కుకొని యక్కడనుండి యిట్టిచేరులలోనుండి యెలుక క్రిందికిప్రాఁకినట్లుగా నీలిపగ్గములవంటి గడ్డపువెండ్రుకలు పట్టుకొని మెల్లగాక్రిందకి