పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సత్యారాజాపూర్వదేశయాత్రలు

మహా---అగ్రాసనాసీనుఁడు తనయభీప్రాయమును జెప్పి దూషణ మాన్పవలెను. ఇప్పుడు నాకు గొప్పచిక్కు తటస్థమయినది ఇఁక మాటాడక యూరకుండుటకు వలనుపడదు. మాటాడినచో నెవ్వరి పక్షమున నేమిచెప్పినను కోపావేశముచేత మూఖా౯రాక్షసు లెవ్వ రేమిచేయుదురో;అయినను నేను బుద్ధిమంతుఁడ నగుటచేతను,పరమ ప్రమాణములైన మనశాస్త్రములు వచ్చి సమయములో నాకు తోడుపడుటచేతను,ధైర్యము తెచ్చికొని యెవ్వరిమనస్సును నొవ్వ కుండ సయోచితముగా నిట్లంటిని----

"ఓ సజ్జనాగ్రగణ్యులారా! దూషణ్ యెవ్వరికిని కూడదు. అందులోను ముఖ్యముగా జ్యొతిశ్శాస్త్ర దూషణ కూడదని మీశాస్త్ర ములుమాత్రమేకాక మాశాస్త్రములును భేరీధ్వనితో ఘేషించు చున్నవి. జ్యొతిఘ్కులమాటలను గాని జ్యొతిశాస్త్రమునుగాని పరిహ సముకానందున శాస్త్రదూషణమని చెప్పుటకు వలనుప