పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>సత్యరాజా పూర్వదేశయాత్రలు

నచోమేలు కలుగుటకు మాఱుగా కార్యవిఘాతము గలిగి కీడుమూఁడును .

మహా౼మీరు చెప్పెడు మాటలు యుక్తికిని లోకానుభవమునకును శాస్త్రమునకు విరుద్ద్గముగా నున్నవి . మంచిసిద్దాంతి శాస్త్రముచూచి యాలోచించిచెప్పినప్పుడొక్కయక్షర మైనను హెచ్చుతగ్గులు లేక ఫలములు సరిగాకలుగును . నాతమ్మునిజన్మపత్రమును మొన్న నేనొక సిద్దాంతికి చూపగా వెనుక జరిగిన దంతయు పూసగ్రుచ్చినట్లు సరిగా నతఁడేకరువు పెట్టినాఁడు . శనిమహాదశలో నాకు ప్రాణాంతకరమైన రోగము వచ్చునని యొకసిద్ధాంతి చెప్పి తప్పించుకొనుటకు ప్రతిక్రియ చేసికొమ్మని యుపదేసింపగా , నేను మెలకువ పడి యుక్తసమయంలో శనిగ్రహజపముచేయించి గ్రహశాంతినిమిత్తము సంతర్పణము చేయించునప్పటికీ నాకు రోగము రానేలేదు . జ్యోతిశాస్త్రము నిజమనుట కింతకంటెను ప్రబల నిదర్శనములు మేరమి కావలెను  ?

ఉప౼మీరు సెలవిచ్చినవారిలో నొక్కటియు నిదర్శన మని చెప్పుటకువీలుపడదు . గతము చెప్పుట యొకగొప్పకాదు . అట్లు చెప్పినదంతయు శాస్త్ర జ్ఞానము వలననే చెప్పబడిన దనుటకును వలనుపడదు . ఈజ్యోతిష్కులవద్ద సాధారణముగా లోకులసంగతులను తెలిసికొనివచ్చి గ్రహములకంటె నూటిగా రహస్యముగా గురువులకు తెలుపఁగలశిష్యులుందురు .అంతేకాక వారు తఱచుగా మాయోపాయముల చేతను కొన్నిసమయములందు ధనదానముచేతను కుటుంబములయందలి ఐరమ రహస్యములను సహిత మాకుటుంబములోని స్త్రీలవలనను పిల్లలవలనను సేవకులవలనను గ్రహించి యవి తమకు ప్రాణము లేనిగ్రహములు చెప్పినట్టుగా చెప్పి విమర్శ లేనివారి కాశ్చర్యము కలిగింతురు . గ్రహపూజవలన మీకు రావలసినరోగమేమో .