పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          లంకాద్వీపము

మా పెద్దతమ్ముడును మా పాలికాపువాని పెద్దకొడుకును తృటికాలమైనను భేదము లేక సరిగా నేకముహూర్తమునందే జననమొందిరి . జనన సమయముల దిరువురకును గ్రహము లెకస్థానమునందే యున్నందున సమాన ఫలము నే యియ్యవలసినను, మా వాడు చదువుకొని పరీక్షల నిచ్చి గొప్ప యుద్యోగము చేయుచుండగ మాపాలి కాపు కొడుకు చదు వెరుగక పొలము దున్నుచు నీచదశ వుందేయున్నాడు.శాస్త్రమబద్దము కాని పక్షమున, ఏకసమయమున జనన మొందిన యిరువురకును గ్రహాములు విరుద్దఫలముల నేల కలుగజేయవలెను ? సిద్ధాంతులు చెప్పినఫలము కొందరికి సరిగాకలుగ వచ్చును . అప్పుడు
సహిత మాఫలములు దైవికముగా కలిగినవే కాని సిద్ద్గాంతి యొఱిఁగి చెప్పుటవలనఁగలిగినవికావు . ఏఁబదియేండ్లు బ్రతుకుదురని జనపత్రములలో వ్రాయబడియున్నవారు కొందరంతకాలము జీవించినను , పలువు రంతకు లోపలను ముగ్గురు నలుగురు రటు తరువాతనుగూడ మృతులగుదురు .ఈ ప్రకారముగానే కష్టములను సుఖములను దైవికముగాకొందఱికి చెప్పినట్లు కలిగినను పలువురకుగలుగవు .కార్యసాఫల్య
మెప్పుడును యుక్తసమయమున తగినపని చేయుటవలనఁ గలుగునుగాని ముహూత౯మువలనఁ గలుగదు .
ఇల్లు కాలుచున్నప్పుడు వెంటనే నీరు పోసినచల్లారును గాని ముహూత౯ము నిమిత్తము వేచియుండినచో చల్లారదు . పాము కరచినప్పుడు తక్షణమే విష వైద్యునికొరకు పరుగెత్తి చికిత్స చేయించిన విషము దిగినుగాని ముహూత౯ము నిమిత్తము వేచియుండినచో విష భాద తగ్గదు . ఈ విధముగానే
వ్యవసాయమునందైనను , వాణిజ్యమునందైనను , మఱియేయితర వ్యాపారమునందైనను ముహూత౯ముల నిమిత్తము వేచియుడక యుక్తసమయమునందు కృషిచేసినప్పుడు మాత్రమే కార్యసాఫల్యమగును . మంచి ముహూత౯మున నిరీక్షించుచు పనిచేయక యోగ్యసమయమును వ్యర్ధవుచ్చి .