పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యారాజాప్రూర్వదేశయాత్రలు

నేదో యొకపక్షములోఁ జేరినగుటచెత వారిని విడిచి విదేశీయడయి నిప్పక్షపాతబుద్ది గలవాఁడయిన వాలఖీల్యమహర్షిని అగ్రాసనె సిమనిజెసి సభసాగింప వచ్చునని యాలొచన చెప్పెను., ముల్లోకములన మ్రింగఁజాలిన దేవాంతక వరాంతకులవంట్టి మహాసమధు౯లంతమంది స్వదేశస్దులుండుగా వ్రేలికణుపెడు లేసి యంగుష్ధమాత్రిశరిరుని పరదేశస్దుని కగ్రపిఠమిచ్చుట యవనకరమని దేశభిమానులు కొండఱాక్షేపించినను అర్హతరులు మఱియెవ్యరును దొరకనందున పరస్పర జయక్షులయియున్న యుభయ పక్షములవారిలొ ప్రదాన పురుషులు నాఁడే తమజజయమును లొకవి తము చేయవలెనన్ని యపేక్ష చేత నన్నుగ్రాసనాసీనునిగా నంగీకరీంచిరి. నేనుసూక్ష్మకాయుఁడగునుట చేత కుర్చిలోఁ గూర్చున్న పక్షమున నన్ను సభికులు చూడఁభెట్టరి ఉపన్యాసకునిపేరు దీఘకారోముఁడని సభవారిలో నొకరునాతోఁజెప్పిరి, అతఁడు వచ్చి బల్లముందు నిలుఁవబడి నప్పుడు మనదేశపు నరపరిమాణనుబట్టి సీలిపగ్గములవలె మూఁడునాలుగు నిలువుల పొడవుగలిగి నేను గురుచున్న బల్లచున్న యాతని గడ్డపు వేంద్రుకల దీఘకాత్వమునుబట్టి దీఘకారోముఁడన్నది సార్దకనామధేయమని నేనుబావిచితిని, ఉపాన్యాస విషయమయి నేను సభవారికివిన్నవించినపిమ్మట నుపన్యాపకుడు తనయుపన్యాసము నుపక్రమించెను. మనవారు గ్రంధములలో మెఘగంభీరభషనముల యధ౯కరోరముగా నాఁడాతనిమాటలు చెవినిబడువఱకును మేఘగంభీరభాషనములయధ౯ము నాకసుభవమునకును రాలెదు. ఆదుప్సహమయిన శ్రవణ విచారణదారుణశబ్దములకు తాళలేక నేను నాచెవులకు గుడ్దలు చొనుపుకొంటి.