Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

కైక-నాభర్తనుదప్ప నేను పరపురుషుని కన్నెత్తి చూడలేదు.

ధర్మా-అదికాదు. ఈయభియోగ పత్రికలో జెప్పబడిన కాలమున డొకపురుషుడు శయనగృహమున నీయొద్దనున్నాడా ?

కైక-నా భర్త నాయొద్దనున్నాడు.

మొ-ప్రహ-అప్పుడున్నవాడు నీభర్తగాడు.నీభర్తయొక్క రూపమును ధరించినచ్చిన వజ్రహస్తుడు.

రెం-ప్రహ-ఆమాట వతమపత్యము. ఆ వేషము వేసికొని వచ్చి నీతో నన్నువాడు వంచకుడయిన వజ్రహస్తుడే.

ధర్మా-ఇటువంటి వ్యవహారములలో పెద్దమనుష్యులు సభలకెక్కరాదు.ఎక్కినపక్షమున నుభయుల గౌరవమును బోవుటయేకాక యిల్లాండ్రకుగూడ నపఖ్యాతివచ్చును. ఈవిషయములో వాది ప్రతివాదు లిద్దఱును సఖ్యపడి సమాధాన పడవలెను.

మొ-ప్రహ-ఈ వజ్రహస్తుడు చెప్పినమాట సర్వజనశ్లాఘా పాత్రముగా నున్నది. ఏలినవారు దోషికి క్రూరదండవము విధింపవలెను.

మొ-ప్రహ-ఓరీద్రోహి ! వజ్రహస్తుడవు నీవా ! నేనా ?

రెం-ప్రహ-ఓరీవంచకుడా ! నీవు వజ్రహస్తుడవుగాక మఱియెవ్వడవురా ? నీవు లోకమును వంచింపదలచు కొన్నను శ్రీమహేశ్వరుని పంచముఖములవలె గూరుచున్న యీ పండితపంచకమైనను నీమోసము తెలిసి కోలేదనుకొన్నావురా ? ఓరిపాపాత్ముడా ! ఓరి క్రూర-