పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

వజ్రహస్తుడు తన కామరూప ప్రభావముచేత ప్రహస్తుడుగా మాఱిపోయినాడు

ఇట్లేకరూపమును బొందినవారిరువురిలో నెవ్వడు ప్రహస్తుడో యెవ్వడు వజ్రహస్తుడో నిర్ణయించుటకు శక్యముకానందున వారిలో నొకనిని మొదటి ప్రహస్తుడనియు నింకొకనిని రెండవప్రహస్తుడనియు నిజము తెలియువఱకును జెప్పవలసి యున్నది.

ధర్మా-నిష్కారణముగా మాకు శ్రమకలుగజేయక మీలో నిజమైన ప్రహస్తుడెవడో శీఘ్రముగా జెప్పుడు.

మొ-ప్రహ-నేనే విజమయిన ప్రహస్తుడను. ఇతడు మాయప్రహస్తుడు.

రెం-ప్రహ-నేను నిజమయిన ప్రహస్తుడను. ఇతడుమాయ ప్రహస్తుడు.

ధర్మా-మీరబద్ధము లాడగూడదు. మీలో వజ్రహస్తుడెవడు ?

మొ-ప్రహ-అతడు వజ్రహస్తుడు.

రెం-ప్రహ-అతడు వజ్రహస్తుడు.

లేఖ-ఈ వ్యవహారము చక్కగానే యున్నది. సత్యమునుకనుగొని శిక్షించువఱకును వీరిలో నొక్కరును నిజముచెప్పరు. ఈసత్యా సత్యముల నిప్పు డీవిద్వాంసులే నిర్నయము చేయవలెను.

ధర్మా-ఆసంగతి తరువాత చూచుకొందము గాని ముందుగా మీయభియోగమేదో వాది సభవారితో మనవిచేయవలెను.

మొ-ప్రహ-కై కనీయను నీకామిని నాభార్య. నేనింట లేనప్పుడీ వజ్రహస్తుడు నావేషము వేసికొనివచ్చి-

రెం-ప్రహ-చీ ! అబద్ధములాడకు-ప్రహస్తుడవు నీవా?

నేనా ?-ఓ మహాప్రభూ ! న్యాయప్రభువులు నా మొఱ్ఱ యాలకింప