పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభౌయంతయు వ్యవహారమును జూడవచ్చిన మహాజనులతో నిండిపోయినది. వారిలో ధర్మాధికారియగు ఖరుడు దక్షిణ ముఖముగా నొక్కయున్న తాసనముమీద గూరుచుండి యుండెను. ఆయనకు కుడిప్రక్కను రెండుమూడు బారల దూరములో వరుసగా వేసియున్న పీఠములపయిని పంచామరతరువులవలె జౌతిషవిద్వాసు లయిదుగురు తలలకు శాలువులు చుట్టుకొని చెవులను కుండలము లల్ల లనాడ గంభీరముగా గూరుచుండి యుండిరి. వ్వారి నామములు వరుసగా వృశ్చికరోముడు, సర్పరోముడు, ఖడ్గరోముడు అగ్నిరోముడు, కంటరోముడు అసి తరువాత నేను మాయజ మానునివలన దెలిసికొన్నాను. రోమకసిద్ధాంతము నభ్యసించుట చేతనో మఱియే హేతువుచేతనో కాని యాదేశమునందు సామాన్యముగా జ్యౌతిష సిద్ధాంతులు నామముల చివరను రోమశబ్దము చేర్పబడు చున్నది. ఆ మహావిద్వాంసులకును ధర్మాధికారికిని నడుమగా లేఖ నోద్యోగి యొకడు నిలువబడి యుండెను. అప్పుడు నిలువబడియున్న యా లేఖకునిపే రతికాయుడు. రాజభటులు చేతు లాడించుచు మాటాడుచున్నవారి నూరకుండుడని కేకలు వేయుచుండగా, ధర్మాధికారి తలయెత్తి చూచి లేఖకుని వైపునకు దిరిగి వ్యభిచార వ్యవహారమును విమర్సించుటకు ముందుగా నందలి వాది ప్రతివాదుల నెదుట బెట్టింపుమని యుత్తరవు చేసెను. అతడు రాజభటులను జూచి ప్రహస్తుని వజ్రహస్తుని కైకసిని దీసికొనిరండుని చెప్పెను. వారు వెంటనేపోయి యిద్దఱు ప్రహస్తులను కైకసిని దీసికొనివచ్చి యెదుట నిలిపిరి.

లేఖ-భటులారా ! మీరిద్దఱు ప్రహస్తులను దెచ్చినారేమి ? వీరిలో వజ్రహస్తుడెవరు ? ప్రహస్తుడెవరు ?

భటు-మేము వాదిప్రతివాదులను గొనిపోయి యొకగదిలో బెట్టి యీవల గూరుచుండగా ప్రభువువారు పిలిచెడి లోపల వారిలో.