Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని యేకరాశి గతులయిన సూర్యచంద్రులను బృహస్పతి చూడకున్న కాలమున బుట్టినవాడు నిశ్చయముగా జూడజుడన్న బృహజ్జాతక వచనమునకు ప్రత్యక్ష విరుద్ధముగానున్న వారిశాస్ర్తము సత్యము కాదని నాలో నేననుకొని, అతనికి గోపము వచ్చునన్న భయముచేత నతనితో నేతద్విషయమును గూత్చి ఒతస్తావింపక వారిది రాక్షస్ శాస్త్రమగుటచేత నట్లు వ్యత్యస్తముగా నున్నదని నిశ్చయము చేసికొని యప్పటి కూరకుంటిని.

నాల్గవ ప్రకరణము.

వెనుకటి ప్రకరణమునందు జెప్పిన ప్రపంచము నడిచిన నాలుగు దినముల కొకనాటి మధ్యాహ్న స్మయమునందు నా యజమానుడయిన మహాకాయుడుగారు నాయొద్దకువచ్చి, నేడు రాజసభ జరగబోవుచున్నది గనుక జ్యౌతిషవిద్వాంసులు చెప్పు తీర్పులయొక్క రీతిని జూచి యానంద్ంచుటకయి నీకోరిక ప్రకారముగా నిన్నక్కడకు గొనిపోవ వచ్చినానని సెలవిచ్చును. నే నాయనయాజ్ఞను శిరసావహించి తత్క్షణమే యుచిత వస్త్రాదులను ధరించి యరగడియ లోపలనే ప్రయాణమునకు సంసిద్ధుడను కాగ నా యజమానుడు నాయాలయముయొక్క తలుపులు మూయించినన్ను గొనిపోయి తన గుఱ్ఱపుబండిలో తాను గూరుచున్న మెత్త మీద నన్ను తన కుడువైపున గూర్చుండబెట్టుకొనెను. నేనెక్కిన బండి రాక్షసిబండి యనియు, దానికి గట్టబడిన గుఱ్ఱములు రాక్షసి గుఱ్ఱములనియు, నేనిప్పుడు నేఱుగ జెప్పనక్కఱలేదుగదా ! ఆబండి ధవళేశ్వరపు కొండంతయున్నది; దానికి గట్టబడిన గుఱ్ఱములను ఒక్కొక్కటి పదియేనుగు