పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/364

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు

సత్య-ఆహా! ఏమి మీశాస్త్రవిశ్వాసము!
మహా-ఏమి? నాశాస్త్రవిశ్వాసమయిన కంతయాశ్చర్య పడుచున్నావు! మీ దేశమునందు శాస్త్రవిశ్వాసములేదా?

సత్య: కావలసినంత యున్నది. మాతుల మరణ యోగమునందు శిశువులు పుట్టినపక్షమున తమగండములను తప్పించుకొనుటకయి మేనమామలు మొదలయినవారు శాస్త్ర విశ్వాసముచేతనే మంత్రసానులకు లంచమిచ్చి శిశువులను చంపించి వేయుదురు. అయినను మాదేశమునం దింగ్లీషు చదువుచేత నట్టి సత్యములనునమ్మని నాస్తికులు కొందఱిప్పుడు బయలుదేఱు చున్నారు.

మహా-కలికాల్మహిమచేత నట్టిబౌద్ధులు మాద్వీపమునందును కొందఱు వెలసి జ్యౌతిష మబద్ధమని కుత్సితబుద్ధి వాదములుచేయుచున్నారు.ఈసారి నిన్ను వారిసభలకు దీసికొనిపోయెదనులే.

సత్య-ఆ నాస్తికాధముల సభలకు నన్ను గొనిపోవుటకంటె ముందుగా మీరీవఱవఱకు వాగ్దానముచేసియున్న ప్రకారముగా నన్నొకసారి శాస్త్రవిశ్వాసము గల పండితసభకు దీసికొనిపోయి జ్యోతిష్యులు న్యాయముతీర్పు విధమును జూపుడు.

మహా-మంచిది. ఈమాటలసందడిలో నీకు శివపూజసమయము మించిపోయినట్టున్నది. ఆకలిచేత నీకన్నులు గుంటలు పడిపోయినవి. నేను లోపలికి బోయి మందోదరిచేత నీకు నైవేద్యము పంపెదను. భక్తులు దేవతాదర్శనమునకు వచ్చెడువేళకూడ నగుచున్నది.(అని లోపలికి బోయెను)

ఆమహాకాయుడు చెప్పినదానినిబట్టి యాతని రెండవభార్యకు పుట్టినకొడుకు జారజాతుడని యెఱిగినవాడవయి,

శ్లో|| స్వలగ్న మిందంచగురుర్ని రీక్ష తే నవా శ శాంకంరవిణాసమాగత్
వపాప కోర్కేణ యతోధవాశశీ పరేణజాతంప్రవదంతి నిశ్చయాత్.