Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంకా ద్వీపము

సత్య-"వృషస్ధేందౌలగ్నే సవితృగురుతీక్షాంకుతనయై స్నుహృజ్ఞాయోఖస్తైర్భవతినియమాక్మావవపతి" అను వరాహమిహిరవాక్యమునుబట్టి మీరుచెప్పిన రాజయోగమునందు బుట్టినవారు జారజుడుకాక మానవపతికావలెను...

మహా-ఆ విషయమయి చర్చ యక్కరలేదు. కారజుడు మానవపతిఉఐనను విసర్జింపవలసినదే.

సత్య-మీ భార్యయందు జారత్వదోష మున్నట్టు మీవఱకెన్నడయిన విన్నారా?

మహా-పుత్రజన్మముచేత శాస్త్రము చెప్పువఱకును నాభార్యయట్టిదని నేను స్వన్నావస్ధయందును ననుకోలేదు. అది మహాపతి వ్రతమనియే యెల్లవారును నేటివఱకును విశ్వసించి, నేను దానిని నిష్కరుణుడనయి నిష్కారణముగా పరిత్యజించితిని నన్నూరక నిందించుచున్నారు. జారత్వమెప్పుడును గూఢముగా జరుగునదిగాని యొకరికి దెలియునదికాదు. సర్వఙ్ఞ కృతమయిన శాస్త్రవిశ్వాసము గలవాడనయి జనులనిందలను లక్ష్యముచేయక ప్రత్యక్షపాక్షియైన శాస్త్రమును బట్టి భార్యపరిత్యాగముచేసి నేను మావంశపరిశుద్ధతను నిలువుకొన్నాను.

సత్య-పాపము! ఆ మెగతి యేమయినది?

మహా-దాని కేమిలోపము? దానికితగిన భరణమేర్పఱిచి నేను మఱియొక కన్యను పాణిగ్రహణము చేసికొన్నాను. నాద్వితీయ భార్యకు నిర్దోషమయిన సుముహూర్తమునందు ప్రధమపుత్ర జనన మయినది. ఆశిశుజన్మమైనది యెఱుగుదువా? వాని జనన సమయమునందు బృహస్పతి యేక రాశిగతులయిన సూర్య చంద్రులను చూడక చక్కగానున్నాడు.